లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్.

*పోటెత్తిన తుంగభద్ర… సుంకేసుల జలాశయానికి భారీ వరద..*

కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నది ప్రవాహం గంట గంటకు పెరుగుతూనే ఉంది. రాజోలి లో ఉన్న సుంకేసుల జలాశయంకు తుంగభద్ర వరద ప్రవాహం పోటెత్తింది. హోస్పేట్ డ్యాం నుండి ఒక లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తుగా 70 వేల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేశారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నది తీరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నల్గొండ :

శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం…

ఇన్ ఫ్లో : 93 036.క్యూసెక్కులు..

ఔట్ ఫ్లో : 36467. క్యూసెక్కులు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు…

ప్రస్తుత నీటి మట్టం : 583.80 అడుగులు…

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312,0450…

ప్రస్తుత నీటి నిల్వ 297.9736.టీఎంసీలు…

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

నల్గొండ.జిల్లా..

నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద ప్రవాహం…

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…

ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులు…

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.50 టిఎంసిలు

ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 294.2618 టీఎంసీలు

ఇన్ ఫ్లో.1,20,009 క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో.35,886.క్యూసెకులు…

తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికలు.. ఏర్పాట్ల ప్రక్రియ వేగవంతం

తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతుండటంతో ఈసీ ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేసింది. ఓటర్ల తుది జాబితా తయారీపై దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికల కోసం కొత్త ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. ఈసీ ఆదేశాల మేరకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని వార్డుల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేస్తున్నారు. అటు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈసీకి ప్రతిపాదించింది….

అరుదైన రికార్డ్ ‌సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు సీఎంగా కొనసాగుతూ, గోవింద్ వల్లభ్ పంత్ (8 ఏళ్లు 127 రోజులు) రికార్డును అధిగమించారు. ఈ మైలురాయితో యూపీకి అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు. మార్చి 19, 2017న మొదట సీఎంగా ప్రమాణ స్వీకరించిన యోగి, వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు..

షెటిల్ కోర్టులో కుప్ప‌కూలిన యువ‌కుడు.

నాగోల్‌లోని ఓ స్టేడియంలో షెటిల్ ఆడుతూ గుండెపోటుతో మ‌ర‌ణించిన రాకేష్ (24)

మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడుగా గుర్తింపు..

కొండాపూర్‌ రేవ్‌ పార్టీలో ఏపీ ఎంపీ స్టిక్క‌ర్ కారు..

AP 39 SR 0001 నెంబరు ఫార్చునర్ కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకుని తిరుగుతున్న అశోక్

డ్రగ్స్‌ పార్టీ నిర్వహించిన వ్యక్తిని అశోక్‌ నాయుడిగా గుర్తింపు.. డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం..

ప్రతి వీకెండ్ ఆంధ్ర నుంచి యువతి, యువకులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు..

అరెస్టయిన 11 మంది మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు..

డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే అశోక్ నాయుడు టార్గెట్..