ప్రధాన వార్తలు…

నా ఫోన్ హ్యాక్ అయింది..కాంగ్రెస్ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి..

ఎవరైనా నా పేరుతో డబ్బులు పంపమని అడిగితే పంపవద్దు.. – కాంగ్రెస్ నాయకుడు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి.. బ్యాంకు వాళ్లు చెక్ బుక్ సంబంధించిన విషయం తెలుసుకోవాలి అని చెప్పి.. తన ఫోను హ్యాక్ చేసినట్టుగా మీడియాకు తెలిపిన చైర్మన్..

ISIS ఉగ్రవాద కుట్ర కేసులో కీలక పురోగతి.

ఉగ్రవాది డానిష్‌ రహస్య స్థావరం గుర్తింపు
రహస్య స్థావరంలో పొటాషియం నైట్రేట్ స్వాధీనం..
ఢిల్లీలో వరుస పేలుళ్లకు కుట్ర
కొద్దిరోజుల క్రితం జార్ఖండ్‌లో డానిష్‌ అరెస్ట్
బోధన్‌లో హుజైఫా యమన్ అరెస్ట్
కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న ఢిల్లీ పోలీసులు.

*ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…*

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేపట్టారు. వివిధ సమస్యలపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.

అసెంబ్లీ సమావేశాలను వారం లేదా పది రోజులు నిర్వహించే అవకాశం ఉంది. ఆరు ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

పంచాయతీరాజ్ సవరణ, మున్సిపల్ చట్టాల సవరణ, ఏపీ మోటారు వాహనాల పన్నులు, ఎస్సీ వర్గీకరణ సహా ది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఎట్ ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్-2025 స్థానంలో బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది..

రోడ్ల తీరుతో విసిగిపోయి బెంగళూరు నుంచి వెళ్లిపోతామన్న టెక్ కంపెనీలు..

విశాఖకు రావాలంటూ లోకేశ్ ఆహ్వానం

బెంగళూరును వీడనున్న ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్‌బక్

గుంతల రోడ్లు, ట్రాఫిక్‌తో విసిగిపోయామన్న కంపెనీ సీఈవో

‘ఎక్స్’ వేదికగా తన ఆవేదన వెలిబుచ్చిన రాజేశ్ యబాజీ

ఇది కర్ణాటక ప్రభుత్వ పాలనా వైఫల్యమంటూ పారిశ్రామికవేత్తల విమర్శలు

సీఈవో నిర్ణయాన్ని సమర్థించిన మోహన్‌దాస్ పాయ్, కిరణ్ మజుందార్ షా

టెక్ హబ్‌గా ప్రసిద్ధి చెందిన బెంగళూరులోని మౌలిక సదుపాయాల వైఫల్యం మరోసారి చర్చనీయాంశమైంది. నగరంలోని అధ్వానమైన రోడ్లు, ట్రాఫిక్ సమస్యలతో విసిగిపోయిన ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ ‘బ్లాక్‌బక్’ బెంగళూరును వీడుతున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఈ పరిణామంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి, ఆ సంస్థను విశాఖపట్నానికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు.

బ్లాక్‌బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యబాజీ నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కర్ణాటక ప్రభుత్వంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. “బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు, కాడుబీసినహళ్ళి ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. బెళ్లందూరులోని మా ఆఫీసుకు ఉద్యోగులు చేరుకోవడానికి గంటన్నరకు పైగా సమయం పడుతోంది. గత తొమ్మిదేళ్లుగా ఇదే నరకం అనుభవిస్తున్నాం. మరో ఐదేళ్లలో కూడా ఈ సమస్య పరిష్కారమవుతుందన్న నమ్మకం లేదు. అందుకే మా కంపెనీని ఇక్కడి నుంచి తరలించాలని నిర్ణయించుకున్నాం” అని ఆయన తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. రాజేశ్ యబాజీ పోస్టుకు బదులిస్తూ విశాఖపట్నానికి తమ కార్యకలాపాలను మార్చుకోమంటూ ఆహ్వానించారు. మరోవైపు, రాజేశ్ నిర్ణయాన్ని బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు మోహన్‌దాస్ పాయ్, కిరణ్ మజుందార్ షా సమర్థించారు. ఇది బెంగళూరులోని పాలనా వైఫల్యానికి నిలువుటద్దమని మోహన్‌దాస్ పాయ్ తీవ్రంగా విమర్శించారు. గోల్డ్‌మ్యాన్ సాక్స్, బి-కేపిటల్ వంటి ప్రఖ్యాత సంస్థల నుంచి పెట్టుబడులు పొందిన బ్లాక్‌బక్ కంపెనీలో సుమారు 1,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు…

హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు.

హైదరాబాద్లో మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి సికింద్రాబాద్ మహేంద్రహిల్స్లో వ్యాపారవేత్త బూరుగు రమేశ్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈడీ అధికారులు అల్వాల్, మారేడుపల్లి ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం..

డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని, రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ఇటీవల లారీ లోడ్ యూరియాను బ్లాక్‌లో అమ్ముతూ పట్టుబడ్డ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మెన్ నాగు నాయక్..

ఓటు చోరీ ‘హైడ్రోజన్ బాంబు‘..

ఓటు చోరీపై ‘హైడ్రోజన్ బాంబు’పేలుస్తానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వారిని ఈసీ కాపాడుతోందని ఆరోపించారు. ఫేక్ అప్లికేషన్లు ఫైల్ చేశారని, ఫేక్ లాగిన్ ఐడీలతో ఓటర్ల పేర్లు డిలీట్ చేశారని మండిపడ్డారు. ఇందిరా భవన్ ఆడిటోరియం నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం.

మరోసారి ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ

కర్ణాటకలో ఆలంద్ నియోజకవర్గంలో 6,018 ఓట్లు తొలగించబడ్డాయి… ఈ విషయం యాదృచ్ఛికంగా బయటపడింది.

బూత్‌ స్థాయి అధికారి తన మామగారి ఓటు లేకపోవడం గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అమెరికా డ్రగ్స్ జాబితాలో భారత్.. సంచలన నివేదిక విడుదల చేసిన ట్రంప్

మాదకద్రవ్యాల రవాణా దేశాల జాబితా విడుదల చేసిన అమెరికా

మొత్తం 23 దేశాల పేర్లను అధికారికంగా ప్రకటించిన ట్రంప్

ఈ జాబితాలో భారత్, చైనా, పాకిస్థాన్ పేర్లకు చోటు

జాబితాలో ఉండటం ప్రభుత్వ వైఫల్యం కాదని అమెరికా వివరణ

కొన్ని దేశాలు డ్రగ్స్ నియంత్రణలో విఫలమయ్యాయని వెల్లడి

మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న దేశాల జాబితాను అమెరికా విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అధికారిక నివేదికలో మొత్తం 23 దేశాల పేర్లను వెల్లడించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ జాబితాలో భారత్‌తో పాటు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మా కూడా ఉన్నాయి. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ జాబితాలో ఉన్న ఇతర దేశాలలో మెక్సికో, కొలంబియా, వెనిజులా, బొలీవియా, ఈక్వెడార్, పెరూ, పనామా, కోస్టారికా, జమైకా, లావోస్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ఒక దేశం పేరు ఉండటం అనేది ఆ దేశ ప్రభుత్వ వైఫల్యాన్ని సూచించదని అమెరికా తన నివేదికలో స్పష్టం చేసింది. భౌగోళిక, వాణిజ్య, ఆర్థిక కారణాల వల్ల కొన్ని దేశాలు మాదకద్రవ్యాల రవాణాకు అనుకూలంగా మారతాయని, అందుకే వాటిని ఈ జాబితాలో చేర్చినట్లు వివరించింది. ఆయా ప్రభుత్వాలు డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది.

అదే సమయంలో గత 12 నెలలుగా మాదకద్రవ్యాల నియంత్రణ ఒప్పందాలను పాటించడంలో, చర్యలు తీసుకోవడంలో “దారుణంగా విఫలమైన” దేశాలుగా ఆఫ్ఘనిస్థాన్, బొలీవియా, బర్మా, కొలంబియా, వెనిజులా పేర్లను ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల భారత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) పనితీరును భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రశంసించడం గమనార్హం. ఓ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఎన్‌సీబీ ఛేదించిన నేపథ్యంలో “అక్రమ మాదకద్రవ్యాల నుంచి అమెరికన్లను రక్షించడంలో, వారి ప్రాణాలను కాపాడటంలో సహాయం చేస్తున్నందుకు భారత ఎన్‌సీబీకి ధన్యవాదాలు” అని అమెరికా ఎంబసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా జాబితాలో భారత్ పేరు రావడం చర్చనీయాంశంగా మారింది.

*11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు – బుల్లెట్‌ రైళ్లు నడిపేలా హైస్పీడ్‌ కారిడార్లు*

రైలు అనుసంధానం లేని 11 మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంపై రైల్వేశాఖ దృష్టి – మొత్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన

రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ మీదుగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి చెన్నైలకు బుల్లెట్‌ రైళ్లు నడిపేలా హైస్పీడ్‌ కారిడార్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్‌ నిర్మాణానికి డీపీఆర్‌లు తయారు చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు రైల్వేశాఖ డీపీఆర్‌లు రూపొందిస్తోంది.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ ఆరు డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వేలో మిగులుతాయి. విజయవాడ,..