లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో పూల రవీందర్*

వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ MLC ఎన్నికల బరిలో జాక్టో (JACTO) అభ్యర్థిగా పూల రవీందర్ (Ex.MLC) ని ప్రకటించిన JACTO చైర్మన్ శ్రీ. G. సదానందం గౌడ్..

*శ్రీశైలం మల్లన్నసేవలో సినీ దర్శకుడు బోయపాటి శ్రీను.*

*కార్తీక సోమవారం కావడంతో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను.*

*ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,అధికారులు..

సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి అర్పిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ తెలిపారు..
శైలజ ప్రాణాలు బలితీసుకున్న పాపం.. ఈ..దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపంగా తగులుతుందన్నారు. 25 రోజులుగా విద్యార్ధిని శైలజ వెంటిలేటర్ మీద నరకం అనుభవించిందని సత్యవతిరాథోడ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలజ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చారని, తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. విషాహారం వల్ల కన్నుమూయడం తీవ్రంగా కలిచి వేస్తున్నదన్నారు. వాంకిడి గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం పాపం కాగా, అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరొక పాపం. అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థిని ప్రాణాలు తీసిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు.నిమ్స్ ఆసుపత్రిలో బిడ్డను పట్టుకొని అక్కడే ఉన్న శైలజ తల్లిదండ్రులకు కూడా భరోసా ఇవ్వడంలోనూ కాంగ్రెస్ సర్కార్‌ పూర్తి వైఫల్యం చెందిందని,చివరకు ఆ అమ్మాయి చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశంతో, దొంగ చాటున మృతదేహాన్ని తరలిస్తుండడం సిగ్గుచేటన్నారు.గిరిజన విద్యార్థినీ మృతికి బాధ్యత వహిస్తూ కుటుంబానికి రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మాజీమంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలపై పాట పాడుతున్న సమయంలో అడ్డుకున్న ప్రజలు..!

మానకొండూర్ నియోజకవర్గములోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల పై పాటలు పాడుతుండగా అడ్డుకున్న గ్రామస్తులు

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదు.. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేసిందని ప్రజలు కళాకారులను నిలదీశారు…

*_అమ్మాయి కోసం తల పగలకొట్టుకున్న యువకుడు_*

వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో ఓ యువకుడు, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని గోడకు కొట్టుకొని తల పగలకొట్టుకున్నాడు.

ఎవరు చెప్పినా వినక పోవడంతో, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు…

*అదానీతో కేసీఆర్ ఫొటో.. బ‌య‌ట‌పెట్టిన సీఎం రేవంత్‌*

తెలంగాణ : అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తాము చట్టప్రకారం టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని చెప్పారు. ఉచితంగా ఎవరికీ ఏమీ కట్టబెట్టడం లేదని తెలిపారు. గత పాలకుల్లో అదానీతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిందెవరో, విమానాల్లో క‌లిసి ప్రయాణించిందెవరో తెలుసని వెల్లడించారు. కేటీఆర్ అదానీ సంకలో దూరాడని విమర్శించారు..

వైభవ్ సూర్యవంశీకి రూ.1.10 కోట్లు

ఐపీఎల్ మెగా వేలంలో నిలిచిన అతిపిన్న వయస్కుడు వైభవ్ సూర్య వంశీ (13)ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రూ.1.10 కోట్లు వెచ్చించి ఆయనను సొంతం చేసుకుంది..

*కేంద్రం సంచలన నిర్ణయం.. త్వరలోనే కొత్త పాన్ కార్డులు.. పాతవన్నీ రద్దు!*

కేంద్ర మంత్రివర్గం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.

ఇది QR కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ చేయబడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA), ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. రూ.1,435 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

PAN 2.0 ప్రాజెక్ట్ అంటే ఏమిటి?
PAN 2.0 ప్రాజెక్ట్ అనేది పన్ను చెల్లింపుదారులకు మరిత మెరుగైన డిజిటల్ అనుభవం కోసం PAN/TAN సేవల సాంకేతిక పరివర్తన ద్వారా పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవల వ్యాపార ప్రక్రియలను రీ-ఇంజనీరింగ్ చేయడానికి ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్..!.

RGV అరెస్టుకు రంగం సిద్ధం.!

హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం పోలీసులు.

విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ.

RGV విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం..

*ఆర్జీవి న్యాయవాది* ..

మీడియా సమక్షంలో విడుదల చేసిన పత్రాలు కోర్టుకు

ప్రస్తుతం హాజరు కాలేము సినిమా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న తరుణంలో రెండు వారాలు నుండి మూడు వారాల సమయం కావాలని కోరారు.

అస్పష్టమైన నోటీసులు జారీచేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అది మానవ హక్కుల ఉలంగన కిందికి వస్తుందని ఆయన తరపున న్యాయవాది బాల మీడియాకు తెలిపారు..

*టెన్త్‌ అర్హతతో అగ్నివీర్‌గా అవకాశం.. !*

*పదో తరగతి అర్హత..*

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. పదో తరగతి అర్హత ఉన్నవారు అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్‌ కీపర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ట్రేడ్స్‌మెన్‌ పోస్టుకు 8వ తరగతి అర్హత సరిపోతుందని పేర్కొంది.

*వీటితో హాజరు కావాలి..*

వారం రోజులపాటు నిర్వహించే అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌లో గతంలో ఎంపికలు నిర్వహించిన మిలటరీ పోలీసు అభ్యర్థులు, ఈ ఏడాది ఫిబ్రవరి 12నాటి నోటిఫకేషన్‌ ప్రకారం విద్యార్హత, స్థానికత, కుల ధ్రువీకరణ, ఈబీసీ తదితర సర్టిఫికెట్లు తీసుకుని హాజరు కావాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులను ఈ ర్యాలీకి ఆహ్వానిస్తోంది.

*వయసు అర్హత..*

అభ్యర్థుల వయసు 17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు ఉండాలి. మహిళా మిలటరీ పోలీస్‌(డబ్ల్యూఎంపీ) పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది. రిక్రూట్‌మెంట్‌ పూర్తి పారదర్శకంగా ఉంటుందని వెల్లడించింది. డబ్బులు ఇస్తేజాబ్‌ ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మవద్దని సూచించింది. అభ్యర్థులు ఇతర వివరాలు, సందేహాల నివృత్తికి 040–27740059, 27740205 నంబర్లలో సంప్రదించాలని తెలిపింది…

ఇప్పటివరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..

ఐపీఎల్ మెగా వేలం ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటివరకు అర్ష్‌దీప్ సింగ్(PBKS) రూ.18 కోట్లు, రబాడ(GT) రూ.10.75 కోట్లు, శ్రేయస్ అయ్యర్(PBKS) రూ.26.75 కోట్లు, బట్లర్(GT) రూ.15.75 కోట్లు, స్టార్క్(DC) రూ.11.75 కోట్లు, పంత్(LSG) రూ.27 కోట్లు, షమీ(SRH) రూ.10 కోట్లు, మిల్లర్(LSG) రూ.7.5 కోట్లు, చాహల్(PBKS) రూ.18 కోట్లు, సిరాజ్(GT) రూ.12.25 కోట్లు, లివింగ్‌స్టోన్(RCB) రూ.8.75 కోట్లు, కేఎల్ రాహుల్(DC) రూ.14 కోట్లకు అమ్ముడుపోయారు.