🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 26 – 11 – 2024,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,
తిథి : ఏకాదశి తె3.31 వరకు,
నక్షత్రం : హస్త తె5.11 వరకు,
యోగం : ప్రీతి మ3.53 వరకు,
కరణం : బవ మ2.29 వరకు,
తదుపరి బాలువ తె3.31 వరకు,
వర్జ్యం : ఉ11.57 – 1.43,
దుర్ముహూర్తము : ఉ8.27 – 9.11,
మరల రా10.29 – 11.21,
అమృతకాలం : రా10.33 – 12.19,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండం : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.14,
సూర్యాస్తమయం: 5.20,
*_నేటి విశేషం_*
*ఉత్పన్న ఏకాదశి*
కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు.
ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిథి.
ఉపవాసాలు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి.
శ్రీమహావిష్ణువు శక్తి స్వరూపాలను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు, ఉత్పన్న ఏకాదశిని కార్తీక మాసంలో విశిష్టమైన ఏకాదశిగా పేర్కొంటారు.
ముర అనే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయననుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది.
అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరుపెట్టాడు.
సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి స్వరూపాలలో ఒకటి.
అందువల్ల ఉత్పన్న ఏకాదశిని ఏకాదశి తిథి జయంతిగా భావిస్తారు.
ఈరోజు ఉపవాసం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పురాణ వచనం.
ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలు పరిహారమవుతాయని నమ్మకం,
ముర అంటే తామసిక, రాజసిక, అరిషడ్వర్గాలకు ప్రతీక.
ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరని పురాణ కథనం…
వితంతువులు ఈ రోజు ఉపవాసం ఆచరిస్తే ముక్తి పొందుతారని చెబుతారు,
ఉత్పన్న ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తులసిని పూజించడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నుంచి దూరం కావచ్చు.
ఈ రోజున కొన్ని తులసీ దళాలను నములుతూ వుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు.
*_🌷శుభమస్తు🌷_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏