హైడ్రా పేరిట బ్లాక్మెయిల్ దుకాణం ఓపెన్ చేశారు.. కేటిఆర్..
కేసీఆర్ హయాంలో తెలంగాణలో చేసిన అభివృద్ధి, సాగునీరు, 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతుభీమా లాంటి పథకాలతో భూముల రేట్లు పెరిగాయి.
ఇప్పుడు భూమి ఉంటే రైతుకు భరోసా ఉన్నట్లే.
మార్పు మార్పు అన్నారు ఉన్న రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది – కేటీఆర్…
తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది
ఎవర్ని పక్కకి పిలిచి అడిగినా ఏడుపు ఒకటే తక్కువ…అమ్మ విలువ అన్నం విలువ అవి ఉన్నపుడు తెల్వదు.. అవి లేనప్పుడే తెలుస్తుంది…
ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం.!
ఇవాళ్టి నుంచి కులగణన ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై వివరాలు సేకరిస్తారు. దాదాపు 85 వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక పరిశీలకుడిని నియమించగా, 10% కుటుంబాలను వీరు మరోసారి సర్వే చేస్తారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రైతులకు కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్..లక్షలాది మంది రైతులకు రైతు భరోసా కట్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రజల్లో ఆదరణ పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే త్వరలోనే రైతులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. రైతు భరోసా స్కీముపై కీలక నిర్ణయం త్వరలోనే తీసుకోనుంది. దీంతో లక్షలాది మంది రైతులుకు ఈ స్కీము నుంచి వచ్చే డబ్బులు అందవని తెలుస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుల గణన నిర్వహించనుంది. ఈ సర్వేలో భూవివరాలు కూడా నమోదు చేయనున్నారు. అందువల్ల ప్రతి కుటుంబానికి ఎంత భూమి ఉందో ఈ సర్వేలో తేలుతుంది. ఈ వివరాల ప్రకారం రైతులకు పంట భరోసా అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
*అమెరికా ఎన్నికలు.. ఆధిక్యంలో ఎవరంటే?*
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నట్లు Real Clear Polling సైట్ తెలిపింది.
పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం ట్రంప్ 219, కమలా హారిస్ కు 211 ఓట్ల రాగా రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది.
స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, పెన్సిల్వేనియా, విస్కన్సిన్, ఆరిజోనా, మిచిగాన్, నార్త్ కరోలినా తదితర రాష్ట్రాల్లోని 108 ఓట్లు కీలకంగా మారనున్నాయి..
*2036 ఒలింపిక్స్ నిర్వహణ కు భారత్ సిద్ధం*
*ధ్రువీకరించి లేఖ పంపించిన IOA*
2036 ఒలింపిక్స్ మరియు పారాలింపిక్స్ గేమ్స్ ను భారత్లో
నిర్వహించేందుకు ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ మేరకు క్రీడల నిర్వహణకు ఆసక్తిని కనబరుస్తూ ఒలింపిక్స్ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ కు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ పంపింది.
ఈ లేఖను Oct 1న పంపినట్టు తెలిసింది.
గతంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2036లో ఒలింపిక్స్ నిర్వహణ పై భారత ఆకాంక్షను వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే..
*WBF ప్రపంచ టైటిల్ గెలుచిన భారత బాక్సర్!!*
* కేమన్ ఐలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ WBF ప్రపంచ టైటిల్ ను భారత బాక్సర్ మందీప్ జంగ్రా గెలిచాడు.
* భారత బాక్సర్ మన్దేప్ జంగ్రా బ్రిటన్ కు చెందిన కొనార్ మెకింతోషన్ ను ఓడించి సూపర్ ఫెదర్వైయిట్ ప్రపంచ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు..
హైదరాబాద్లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి.
వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు.
నేటి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు.
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు.
రాంగ్రూట్లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంపు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్ట్ సీరియస్..
త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు అనిత
AP: మహిళలు, చిన్న పిల్లలపై ఆఘాయిత్యాలు పెరుగుతున్నాయని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులకు దొరకకుండా నేరస్థులు తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ ముందు చాలా టాస్క్లు ఉన్నాయని, శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. ప్రతి జిల్లాలోనూ సోషల్ మీడియా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు…
*రీల్స్ మోజులో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి: వీడియో వైరల్*
యూపీలో ఓ మహిళ రీల్స్ మోజులో కన్న కూతురినే గంగలో వదిలేయడంతో ఆమె మరణించింది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వారణాసికి చెందిన అంకిత తన కుమార్తె తాన్యతో కలిసి పుణ్యస్నానాలు ఆచరించేందుకు గంగా నదికి వెళ్లింది. అక్కడ స్నానమాచరిస్తూ తాన్యను మరిచిపోయి నీటిలో వదిలేసింది.
ఆమె లోతైన నీటిలోకి వెళ్లి చనిపోయింది.
ఇదంతా గట్టుపై నుంచి వీడియో తీస్తున్న యువతి కూడా గమనించకపోవడం గమనార్హం…
కేంద్రం కీలక నిర్ణయం.. 15 గ్రామీణ బ్యాంకుల విలీనానికి కసరత్తు!
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. నాల్గో విడుత విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే ప్రస్తుతం 43గా ఉన్న ఆర్ఆర్బీలను 28కి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా రాష్ర్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 15 బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నారు. కాగా, ఆర్ఆర్బీల కార్యకలాపాలను మరింత ప్రభావవంతంగా మార్చడం, ఖర్చుల హేతుబద్ధీకరణే లక్ష్యంగా ఈ విలీనాలకు దిగుతున్నట్టు మోదీ సర్కారు చెప్తున్నది..
అమీన్పూర్లో హైడ్రా ఆధ్వర్యంలో సర్వే..రిజిస్ట్రేషన్ లావాదేవీలపై కన్ను.!
ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణల కట్టడికి ఏర్పాటైన హైడ్రా ఈమధ్య కాస్త స్పీడ్ తగ్గించింది. కానీ, సైలెంట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపరేషన్లో ఉంది. రోజూ హైడ్రాకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే క్రమంలో అధికారులు సర్వేలు చేస్తున్నారు. తాజాగా అమీన్ పూర్ భూములపై ఫోకస్ పెట్టింది హైడ్రా. పార్కులు, రహదారులు కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అమీన్పూర్లో మంగళవారం హైడ్రా ఆధ్వర్యంలో సర్వే జరిగింది.
జేడీ సర్వే కార్యాలయ అధికారులతో పాటు హైడ్రా అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఎకరాకు పైగా ఉన్న పార్కు స్థలంతో పాటు, రహదారులను గోల్డెన్ కీ వెంచర్ వాళ్లు కబ్జా చేశారంటూ వెంకటరమణ కాలనీ వాసులు ఫిర్యాదు చేవారు. ఇరు పక్షాల వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సర్వే జరిపించింది హైడ్రా. మొత్తం 5 సర్వే నెంబర్లలోని 150 ఎకరాలకు పైగా ఉన్న స్థలాన్ని అధికారులు సర్వే చేశారు.