లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

‘రాజకీయ సన్యాసానికి సిద్ధం’.. KTR సంచలన సవాల్

CM రేవంత్‌కు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సంచలన సవాల్ చేశారు. 100 శాతం రుణమాఫీ అయితే రాజకీయ సన్యాసానికి సిద్ధమని ఇప్పటికే సవాల్ చేశానని.. ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని ప్రకటించారు. హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. పట్నం నరేందర్ రెడ్డిని, లగచర్ల రైతులను అరెస్ట్ చేసి 35 రోజులైందని అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు..

సమస్యలపై చర్చించేందుకు ఇబ్బంది లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులైనా నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. BRS సభ్యులే రోజుకొక అంశంపై వాయిదా తీర్మానం కోరుతున్నారని చెప్పారు. ఏ అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వాలన్న దానిపై వాళ్ళకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు..

అప్పుపై చర్చ: భట్టి సవాల్.. హరీశ్‌ ప్రతిసవాల్

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదేళ్ళు పూర్తయ్యేసరికి అప్పు రూ.6.36లక్షల కోట్లకు చేరుతుందని అసెంబ్లీలో BRS నేత హరీశ్ రావు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో రూ.4,17,496 కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్ల అప్పు చేశామని గోబెల్స్‌ ప్రచారం చేశారన్నారు. దీనిప్రై ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చామని, తాము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి.. స్పీకర్‌ అనుమతితో ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రతి సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ అంత సాహసం చేస్తారా?

హైదరాబాద్‌లోని రోడ్ల విస్తరణ కోసం రేవంత్ సర్కార్ కొందరు ప్రముఖుల ఇళ్ల గోడలను కూల్చేందుకు మార్కింగ్ చేసి పెట్టింది. కేబీఆర్ పార్క్ సమీపంలోని నందమూరి బాలకృష్ణ ఇంటి గోడపై అధికారులు బిగ్ మార్కింగ్ పెట్టారు. ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి చెందిన ఇంటి గోడకు సైతం మార్కింగ్ చేసి పెట్టారు. దీంతో బాలకృష్ణ ఇళ్లు కూల్చేస్తారా? జానారెడ్డి ఇంటిమీదకు జేసీబీని పంపిస్తారా? అనేది నగరవాసుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుంది…ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.

తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం అవసరం..

సచివాలయం పక్కన ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుంది.. అసెంబ్లీ నిర్మాణానికి అవసరమైతే FTL పరిధిని కుంచించవచ్చు.. సచివాలయం, అసెంబ్లీ, అమరవీరులస్థూపం.. హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున చూడచక్కగా ఉంటాయి.. సచివాలయం, అసెంబ్లీ పక్కపక్కనే ఉంటే పాలనపరంగా బాగుంటుంది.

*స్థానిక సంస్థల రిజర్వేషన్లు మార్పు.. ఇక ఐదేళ్లకు ఒకసారి చేంజ్*

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఐదేండ్లకోసారి రిజర్వేషన్లు మారనున్నాయి. సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు ప్రస్తుత ఎన్నికల్లో చేంజ్ కానున్నాయి.

రిజర్వేషన్లు వరుసగా రెండు సార్లు కాకుండా ఒకే సారి ఉండే విధంగా పంచాయతీరాజ్చట్టం 2018లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు సైతం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో మూడు గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది.

*ప్రతి సారీ రిజర్వేషన్లు మార్పు*

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక సారి రిజర్వేషన్ ఖరారు అది పదేండ్ల పాటు (రెండు టర్ములు) కొనసాగేది. కానీ ప్రస్తుత ప్రభుత్వం దానిని ఒక టర్మకు కుదించింది. దీని ప్రకారం ప్రతి ఐదేండ్లకోసారీ రిజర్వేషన్లు మారనున్నాయి. రిజర్వేషన్‌ను ఒక సారరే (ఒక టర్మ్) అమలు చేయాలని వినతులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు కేబినేట్ఆమోదం తెలిపింది. చట్ట సవరణతో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌లకు సంబంధించిన అన్ని రిజర్వేషన్లు మారనున్నాయి.

*ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ*

ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న తల్లిదండ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి వరకు అనుమతి లేదు. దీంతో ముగ్గురు, అంత కన్నా ఎక్కువగా పిల్లలున్న వారు పోటీ చేసేందుకు అనర్హులుగా ఉండేవారు. అలాంటి వారికి సైతం ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించాలని కొంత కాలంగా వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు.

*ప్రతి మండలానికీ కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు*

ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్రభుత్వం చట్టానికి సవరణలు తీసుకొచ్చింది. ఈ నిర్ణయం ద్వారా తక్కువ జనాభా ఉన్న గ్రామీణ మండలాల్లోనూ కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండనున్నారు. ఎంపీపీ ఎన్నిక సమయంలో ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో ఓటరు జాబితాలో ఓటరు చేరడానికి అర్హత తేదీని సైతం మార్చారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి ఏడాదికి ఒకసారి అవకాశం కల్పించేది. కానీ తాజాగా ఏప్రిల్, జూలై, అక్టోబరు ఒకటో తేదీని (ఏడాదిలో మూడు సార్లు) అర్హత తేదీగా మార్చారు. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా చట్టంలో మార్పులు చేశారు.

*సర్పంచ్‌లను తొలగించేందుకు కలెక్టర్లకు మరిన్ని పవర్స్*

సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను తొలగించే విషయంలో కలెక్టర్‌లకు మరిన్ని అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీనితో పాటుగా అనర్హత వేటు వేసే విషయంలోనూ చట్ట సవరణ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు, ఈవీఎంలు, బ్యాలెట్బ్యాక్సుల వినియోగం విషయంలోనూ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా అసెంబ్లీలో ఆమోదించనున్న పలు బిల్లులకూ కేబినెట్ ఆమోదం తెలపనున్నది. ఓఆర్‌ఆర్లోపలి 51 గ్రామ పంచాయతీలను దగ్గర్లోని మున్సిపాలిటిల్లో వీలినం చేయడం, హైడ్రా చట్టానికి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…

భారత్ ఉత్పత్తులపై ప్రతీకార పన్ను తప్పదంటూ ట్రంప్ వార్నింగ్..!

అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రెడీ అవుతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్..భారత్ పట్ల తన వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి భారత్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు ట్రంప్. అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్స్ వసూలు చేస్తోందంటూ ఆరోపణలు చేశారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై భారత్, బ్రెజిల్ వంటి దేశాలు అత్యధిక టారిఫ్ లు విధిస్తున్నాయని..100, 200ల శాతం పన్నులు వేస్తున్నాయని తెలిపారు. దేనికైనా ప్రతిచర్య ఉంటుందని..వాళ్లు మాపై పన్నలు విధిస్తే మేము కూడా అదే స్థాయిలో పన్నలు వసూలు చేస్తామని తెలిపారు. ఒకవేళ భారత్ వంద శాతం పన్నలు విధిస్తే..మేము వారిపై అలాగే ఛార్జ్ వేయకూడదా అని ప్రశ్నించారు. ఆయా దేశాలు సుంకాలు వసూలు చేయడం అనేది వారి ఇష్టమే అయినప్పటికీ మేము కూడా అలాగే స్పందిస్తామని ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ పలుమార్లు సుంకాల అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. తాజా వ్యాఖ్యలతో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది..

సభలో భూభారతి చట్టం ప్రవేశపెట్టబోతున్నాం-మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.

గత పాలనలో ఇష్టారాజ్యంగా దోచుకున్నారు..భూములను తిరిగి స్వాధీనం చేసకుంటాం..గత ప్రభుత్వం ధరణిని తమ ఇంటి సంస్థగా వాడుకుంది..భూభారతి చట్టం రూపకల్పనలో…హరీష్‌రావు, వినోద్ లాంటి వాళ్ల సూచనలు తీసుకున్నాం..ప్రభుత్వ భూములు దోచుకున్నవారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు..

ప్రియాంకాగాంధీ పాలస్తీనా బ్యాగుపై సీఎం యోగి కీలక వ్యాఖ్యలు.!

పాలస్తీనా’ అని రాసి ఉన్న హ్యాండ్ బ్యాగు(Palestine bag)ను ధరించి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) పార్లమెంటుకు వెళ్లిన అంశంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) స్పందించారు..ఓ వైపు పాలస్తీనా బ్యాగుతో కాంగ్రెస్ నాయకురాలు పార్లమెంటులో తిరుగుతుంటే.. మరోవైపు తమ రాష్ట్రం నుంచి 5,600 మందికిపైగా యువత ఇజ్రాయెల్‌(Israel)కు వెళ్లారని ఆయన వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో నిర్మాణ రంగ పనులు చేస్తున్న యూపీ యువతకు ప్రతినెలా రూ.1.50 లక్షల శాలరీ, ఉచిత వసతి, ఆహారంతో పాటు పూర్తి భద్రతను కల్పిస్తున్నారని యోగి చెప్పారు. మంగళవారం రోజు యూపీ అసెంబ్లీలో పాలస్తీనా హ్యాండ్ బ్యాగు అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే ప్రియాంక నోరు విప్పడం లేదు. కానీ పాలస్తీనా బ్యాగు వేసుకొని ఫ్యాషన్ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు” అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. దీనికి ప్రియాంకాగాంధీ కౌంటర్ ఇస్తూ.. ”నేనేం ధరించాలనేది ఎవరు నిర్ణయిస్తారు ? బీజేపీ వాళ్లది పురుషాధిక్య భావజాలం. అందుకే తాము చెప్పిన విధంగానే మహిళల వస్త్రధారణ ఉండాలని వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగాలంటే అక్కడి ప్రభుత్వంతో భారత సర్కారు చర్చించాలి. ఏది పడితే అది వాగితే సమస్య పరిష్కారం కాదు” అని పేర్కొన్నారు..

జమిలి’.. 2029లో.. కాదు 2027లోనే.!

ఎన్నికలు ఎప్పుడు? అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య ఇప్పుడు దీనిపై ఒకటే చర్చ..!

లాబీల్లో ఎమ్మెల్యేల చర్చ ‘జమిలి’ గురించి. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో.. మంగళవారం వివిధ పార్టీలకు చెందిన శాసనసభ సభ్యుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అధికార, ప్రతిపక్షాల వారు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో 2028 చివరి వరకు అధికారం ఉన్నందున.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జమిలి ఎన్నికలు 2029లోనే ఉంటాయనే ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్‌సభ సభ్యుల పదవీ కాలం 2029 వరకు ఉన్నదని.. పైగా, ప్రధాని మోదీ రెండేళ్ల అధికార గడువును వదలుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశమే లేదంటూ తమ వాదనను సమర్థించుకున్నారు.

ఇక బీఆర్‌ఎ్‌స ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికలు 2027లోనే జరుగుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. జమిలికి మరో రెండేళ్లలోనే అవకాశం ఉందన్నారు. అప్పటితో కాంగ్రెస్‌ ప్రభుత్వ గడువు ముగిసిపోతుందని, అసెంబ్లీకి వచ్చిన గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒకరు జోస్యం చెప్పారు. మరోవైపు తెలంగాణలో వచ్చేసారి కచ్చితంగా తమదే అధికారం అనే ఆలోచనలో ఉన్న బీజేపీకి చెందిన శాసనసభ్యులు మాత్రం రెండు రకాల వాదనలు వినిపించారు. ”జమిలి ఎన్నికలు 2027లో జరగొచ్చు.. లేదా 2029లో ఉండొచ్చు” అని బీజేపీ శాసనసభా పక్ష ఉప నేత పాయల శంకర్‌ అన్నారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు…