🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 18 – 12 – 2024,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిథి : *తదియ* ఉ11.55 వరకు,
నక్షత్రం : *పుష్యమి* తె3.27 వరకు,
యోగం : *ఐంద్రం* రా10.25 వరకు,
కరణం : *భద్ర* ఉ11.55 వరకు,
తదుపరి *బవ* రా12.02 వరకు,
వర్జ్యం : *ఉ11.10 – 12.48*,
దుర్ముహూర్తము : *ఉ11.34 – 12.18*,
అమృతకాలం : *రా8.56 – 10.34*,
రాహుకాలం : *మ12.00 – 1.30*,
యమగండం : *ఉ7.30 – 9.00*,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 6.28,
సూర్యాస్తమయం: 5.25,
*_నేటి విశేషం_*
*సంకష్టహర చతుర్థి*
_ఈనాడు నారద మహర్షి చేసిన శ్రీ సంకట నాశన గణేశ స్తోత్రం – సంకటహర చవితి రోజు 4 సార్లు చదవడం వలన గణపతి అనుగ్రహంతో మనం జీవితంలో సంకటాలు తోలగిపోతాయని విశ్వాసం_
*ఓం గం గణపతయే నమః*
*శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం*
*నారద ఉవాచ*
*ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |*
*భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే | 1 |*
*
*ప్రధమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |*
*తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం | 2 |*
**
*లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |*
*సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం | 3 |*
**
*నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |*
*ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం | 4 |*
**
*ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |*
*న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! | 5 |*
**
*విద్యార్ధీ లభతే విద్యాం, ధనార్ధీ లభతే ధనం |*
*పుత్రార్ధీ లభతే పుత్రాన్,మోక్షార్ధీ లభతే గతిం | 6 |*
**
*జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |*
*సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః | 7 |*
*
*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |*
*తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః | 8 |*
*ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*
సకల విఘ్నాలకు అధిపతి ఆదిదంపతుల కుమారుడైన వినాయకుడు, ఆయనను పూజీస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి.
మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం.
ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది, అదే సంకటహర చతుర్థి!
ఈ రోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయట.
పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలూ తొలగిపోతాయి.
ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి, ఈ పూజ చేసేవాళ్లు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, తలస్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి, రోజంతా ఉపవాసం ఉండాలి, పాలు, పండ్లు, పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు.
ఇక సాయంత్రం సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు ఆరుగంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి, దీపం వెలిగించాలి.
ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు.
ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి 3, 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి.
పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి.
మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.
ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి.
తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి, శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి, పుత్రప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన.
ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి, ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
~స్వస్తి🙏🌺…~
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏