చిలుకూరి ఆలయ అర్చకుడికి బండి సంజయ్ ఫోన్
రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగరాజన్‌కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్ కాల్లో పరామర్శించారు. ఘటన వివరాలను ఆరా తీయడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు..
SRPT: రేపు ముసాయిదా జాబితా విడుదల
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. SRPT జిల్లాలో 23 ZPTCలు, 232 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు..
బంగ్లాదేశ్‌లో ‘డెవిల్ హంట్’.. 1300 మంది అరెస్టు..
బంగ్లాదేశ్‌లో ‘డెవిల్ హంట్’.. 1300 మంది అరెస్టు
బంగ్లాదేశ్‌లో యూనస్ సర్కారు ఆపరేషన్ డెవిల్ హంట్ కొనసాగుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్ పార్టీ గుర్తులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరుగుతున్నాయి. దేశంలో అస్థిరతను సృష్టించే దయ్యాలను ఏరివేస్తామని బంగ్లాలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆర్మీ, పోలీసులు, ప్రత్యేక భద్రతా యూనిట్లు కలిసి ఇప్పటివరకు 1,300 మందిని అరెస్టు చేశాయి..
నేడు మహా కుంభమేళాకు వెళ్లనున్న రాష్ట్రపతి
యూపీలోని ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లనున్నారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహా కుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరించనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది తెలిపారు. కాగా, గత 26 రోజులుగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం..
స్కూల్ బాలికపై యువకుడు అత్యాచారం.. ఆపై ఆటో డ్రైవర్
స్కూల్ బాలికపై యువకుడు అత్యాచారం.. ఆపై ఆటో డ్రైవర్.
ఆంధ్రప్రదేశ్ : స్కూల్ బాలికపై ఓ యువకుడితో పాటు ఆటో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. గత నెల 29న ఆటో డ్రైవర్ సునీల్ బాలికను స్కూల్‌కు ఆటోలో తీసుకెళ్తుండగా.. సతీష్ బైక్‌తో అనుసరించాడు. దారిలో బాలికకు వాంతి కాగా.. ఆమెను ఇంటికి తీసుకెళ్తానని సతీష్ బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బాలికపై లైంగికదాడి చేశాడు. సాయంత్రం స్కూల్‌కి తీసుకొచ్చి పాఠశాల ఆటోలో ఎక్కించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ సునీల్ కూడా బెదిరించి లైంగికదాడికి ఒడిగట్టాడు..
ఎన్నికల్లోగెలుపు ఓటములు సహజం…ఢిల్లీ ఎన్నికలపై ఆసక్తికర విషయాలను పంచుకున్న జగ్గారెడ్డి.……….
కేజ్రీవాల్ కి అహం వచ్చింది….
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చిట్……చాట్………
రాహుల్ గాంధీ పర్సినాలిటిని డామినేట్ చేసే పర్సనాలిటీ కేజ్రీవాల్ ది కాదు……..
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి అప్ కి లేదు…….
ఒంటరిగా వెళ్లి పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలని రాహుల్ గాంధీ భావించారని అనుకుంటున్న..
కొట్లాడడానికి సిద్ధం కమ్మని ఢిల్లీ ఎన్నికల ద్వారా రాహుల్ గాంధీ క్యాడర్ కి ఒక ఇండికేషన్ ఇచ్చారని భావిస్తున్నాను………….
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం………
ఈరోజు ఢిల్లీలో బీజేపీ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది…………
దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి.. కేటీఆర్
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ను సౌందర్యను పరామర్శించిన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి పాడి కౌశిక్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు
మీడియాతో కేటీఆర్..
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యింది..
ఇది అత్యంత దుర్మార్గమైన నీచమైన కార్యక్రమం..
ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసిన ఏ యెజెండ తో చేసిన ఉపేక్షించకూడదు..
దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్, సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..
ఈ దాడికి పాల్పడ్డవారు ఏ ముసుగులో ఉన్న ఈ జెండా పట్టుకున్న వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి..
ఈ దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి..
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి…
*ఈ నెల 19 నుంచి శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు!*
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈనెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూలు ఖరారు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 23న శ్రీశైలంకు వెళ్లనున్నారు. స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించను న్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఎవరైనా వచ్చి పట్టు వస్త్రాలను సమర్పించేవారు.
ఈసారి నేరుగా ముఖ్య మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనుండటం గమనార్హం.మరోవైపు మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఈరోజు శ్రీశైలంకు వెళ్లనుంది.
మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్, ఆనం రామనా రాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, అనిత శ్రీశైలంలో పర్యటించను న్నారు
శ్రీశైలంను ఆథ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విదేశీ యాత్రికులను సైతం ఆకట్టుకునేలా అంతర్జా తీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది…..
హీరో అల్లు అర్జున్ మామ’ చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూల్చివేత కు రంగం సిద్ధం..!
సినిమా విడుదల సందర్భంగా చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో అల్లు కుటుంబానికి తీవ్ర కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో గడిపి వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంతో శత్రుత్వం ఏర్పడడంతో అల్లు కుటుంబానికి వరుస కష్టాలు ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. బన్నీ టార్గెట్‌గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌కు మరో షాక్ తగిలే అవకాశం ఉంది. అతడి మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటిని కూల్చే ప్రమాదం ఉంది. తన ఇంటిని కూల్చే అవకాశం ఉండడంతో బన్నీ మామ ప్రజవాణిలో ఫిర్యాదు చేశాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ కుటుంబ వ్యవహారం సినీ పరిశ్రమతోపాటు రాజకీయంగా చర్చనీయాంశమైంది..