నియోజకవర్గానికి నేనే లీడ ర్‌. వేరెవ్వరూ కాదు..

తుంగతుర్తి నియోజకవర్గానికి నేనే లీడ ర్‌. వేరెవ్వరూ కాదు..స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్‌లు ఇచ్చేది నేనే. నేను సంతకం చేస్తేనే ఇందిరమ్మ ఇళ్లు వస్తాయి. ఎవరో బీఫామ్‌లు ఇస్తామంటే, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటే నమ్మవద్దు” అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. కాంగ్రెస్‌ అసమ్మతి నాయకులు ఇటీవల మోత్కూరులో నిర్వహించిన సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతూ ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. తనతో వచ్చేవారే తనవారని స్పష్టం చేశారు… ఎవరిని చెప్పుకొచ్చిన లోకల్ గా ఉన్నది ఎమ్మెల్యేగా నేనే.. అధిష్టానం కూడా నా మాటే వింటుంది.. ఎవరు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసిన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేది నేనే అంటూ కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడా… డిగ్రీ కాలేజీ తెచ్చిన,, త్వరలో ప్రారంభం కానున్న నూతన కెనాల్ పనులని,, వరికుంట అభివృద్ధి పనులను కూడా తానే స్వయంగా దగ్గరుండి పూర్తి చేస్తానని అన్నారు.. ఎవరు కల్లబొల్లి మాటలు చెప్పిన నమ్మొద్దని అన్నారు..