లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్

ఫిబ్రవరి 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.

తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం

సమావేశంలో పాల్గొననున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మరియు మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జులు

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్న కేసీఆర్..

పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు

గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా.. దీంతో భర్త కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన క్రమంలో నందిగామ వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు

కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. ఆ వాహనంలో కూర్చున్న కంచికచర్ల సీఐ

ఇదేమిటని అడిగితే.. వాళ్ల నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న ఆ కారుని పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు…

*Telangana:*

రంగరాజన్ పై దాడి కేసులో మరో ఏడుగురి అరెస్ట్

శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతాలకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మొయినాబాద్ పోలీసులు.

పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్న పోలీసులు…

కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి నిరసన సెగ

హామీలపై నిలదీసిన గ్రామస్థులు

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధిలోని గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవికి నిరసన సెగ

మీరు వాగుపై వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. ఏమైంది సారు అంటూ నిలదీసిన మహిళలు

రైతుబంధు ఇస్తలేరు, రూ.2500 ఇస్తలేరు, రుణమాఫీ కాలేదు, ఎందుకు వచ్చారు? అంటూ నిలదీత

పోలీసుల సహాయంతో అక్కడి నుంచి ఇర్విన్ గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే, ఎంపీని అడ్డుకున్న గ్రామ ప్రజలు

ఇర్విన్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ, ఇర్విన్ రిజర్వాయర్‌ను రద్దు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన తీపిన గ్రామస్థులు

ఈ సందర్భంగా పోలీసులకు, స్థానికులకు మధ్య తోపులాట జరిగింది…

బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది..యాతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశిస్తున్నా

మేము అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, చేసిన పనులు చెప్పుకోవడంలో విఫలం అయ్యాం

ప్రతి పక్షాలు ప్రచారం చేస్తున్నంతగా తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదు – ఢిల్లీలో మీడియాతో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చిట్ చాట్…..

మంచు మనోజ్‌ కీలక వ్యాఖ్యలు
పరోక్షంగా మంచు విష్ణు, కన్నప్ప సినిమాపై విమర్శలు..

సినిమా బడ్జెట్‌ ఎంత అనేది ఎవరూ చూడరు
సినిమా బాగుందా..లేదా అనేది కీలకం-మంచు మనోజ్..

నన్ను ఏం చేసినా అభిమానుల గుండెల నుంచి వేరుచేయలేరు..

నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను
న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తా-మంచు మనోజ్..

పిల్లలకు థియేటర్ ఎంట్రీపై ఆంక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

TG: రా. 11 నుంచి ఉ.11 లోపు థియేటర్లలోకి 16 ఏళ్లలోపు పిల్లల ప్రవేశంపై హైకోర్టు ఆంక్షలు విధించడంపై అప్పీల్ పిటిషన్ దాఖలైంది. ఆ తీర్పుతో తాము నష్టపోతామని మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం పేర్కొంది. అయితే సింగిల్ బెంచ్ వద్ద పిటిషన్ పెండింగ్లో ఉన్నందున అప్పీలుపై జోక్యం చేసుకోలేమని CJ బెంచ్ స్పష్టం చేసింది. ఆ పెండింగ్ పిటిషన్లోనే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది..

SRPT: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి..

మణిపుర్ లో రాష్ట్రపతి పాలన.

మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు.

విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు..

*రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిపై చెప్పు విసిరిన ముద్దాయి*

పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవితఖైదు

తనను దోషిగా ప్రకటించడాన్ని జీర్ణించుకోలేక చెప్పు విసిరిన వైనం

నేరస్తుడిని చితకబాదిన న్యాయవాదులు

హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు కోపం తట్టుకోలేక జడ్జి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. పోక్సో కోర్టు న్యాయమూర్తిపై చెప్పు విసిరాడు. పోక్సో కేసులో తనను జడ్జి దోషిగా ప్రకటించడంతో జీర్ణించుకోలేకపోయాడు. జడ్జిపై చెప్పు విసిరాడు. జరిగిన ఘటనతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు నేరస్తుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది…

పార్టీకి మన సత్తా చూపించాల్సిన టైమొచ్చింది.. MLA రాజాసింగ్ సంచలన మెసేజ్.

తెలంగాణలో బీజేపీ(BJP Telangana) జిల్లా అధ్యక్షుల ప్రకటన మరోసారి వివాదాలకు దారి తీసింది. తాను చెప్పిన వ్యక్తికి గోషామహల్‌ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు…అధిష్టానానికి తమ బలం ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందంటూ.. అనుచరులు, పార్టీ శ్రేణులకు రాజాసింగ్ వాయిస్ మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఎంపికపై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొన్ని జిల్లాల్లో అధ్యక్షుల ఎంపికపై అసంతృప్తి నెలకొంది.

కాగా.. తొలి విడతలో 19 జిల్లాలకు అధ్యక్షుల(BJP Dist Presidents)ను ప్రకటించిన అధిష్టానం.. ఇవాళ రెండో విడతలో నాలుగు జిల్లాలకు ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సి.గోదావరి, మహబూబాబాద్‌కు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ-గోషామహాల్‌కు టి. ఉమామహేంద్రను అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర సహా ఎన్నికల అధికారి కే.గీతామూర్తి అధికారిక ప్రకటన విడుదల చేశారు..