Letsest news… లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్..

తెలంగాణ : సరస్వతి పుష్కరాలు.. రూ.35 కోట్లు కేటాయింపు

తెలంగాణ :సరస్వతి పుష్కరాలు.. రూ.35 కోట్లు కేటాయింపు
తెలంగాణ :కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15 నుంచి ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులు కేటాయించింది. ప్రతిరోజు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు రావొచ్చని అంచనా వేసింది. ఈ సందర్భంగా మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు యాప్‌‌ను ఆవిష్కరించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. RTC ఉచిత ప్రయాణం వల్ల పుణ్యక్షేత్రాలకు వచ్చే మహిళా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, తద్వారా దేవదాయశాఖకు ఆదాయం పెరిగిందని చెప్పారు..

Earthquake: అఫ్గాన్‌లో భారీ భూకంపం, భారత్‌లో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కంపించిన భూమి

ఆఫ్ఘనిస్తాన్ లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.9 గా గుర్తించారు. ఆఫ్గాన్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. బుధవారం ఉదయం 4 గంటల 43 నిమిషాలకు భూకంపం సంభవించింది.

ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు

ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూపూర్ ప్రాంతంలో భూ ప్రకంపనలో వచ్చాయి. 75 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.

అఫ్గాన్‌లో భూకంపం సంభవించిన అనంతరం భారత్‌లోని పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్వార్ లో ఉదయం 5 గంటల 14 నిమిషాలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.4గా గుర్తించారు. 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపారు.

బంగ్లాదేశ్ లోనూ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటల 7 నిమిషాలకు పలు చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రతను 2.9గా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది..

*🔹ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా సౌరవ్ గంగూలీ*

ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్లీ నియమితుడు అయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ అధికారికంగా ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు. 2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021 నుంచి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు…

*🔹పోలీసులకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు*

ఛత్తీస్ ఘడ్ .. కొండగావ్.. జిల్లా మరియు నారాయణపూర్.. జిల్లాల సరిహద్దు ప్రాంతంలో.. కిలం.. మరియు.. బరుగుమ్.. అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా కొనసాగుతున్న ఎదురు కాల్పులు,,

ఇద్దరు మావోయిస్టులు మృతి

ఘటన స్థలం వద్ద నుంచి ఒక ఏకే 47 మరియు ఇతర ఆయుధాలు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

కొనసాగుతున్న ఎదురు కాల్పులు..

*🔹రేపు(17) టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ.డి కార్యాలయం ముందు నిరసన, ధర్నా...*

బీజేపీ, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ రేపు 17వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఈ.డి కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు.. మహేష్ కుమార్ గౌడ్..

నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్ష పూరితంగా ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా..

కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని టీపీసీసీ పిలుపు…

డైమండ్ జూబ్లీ పుట్టిన రోజుకు విదేశీ టూర్‌లో చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏప్రిల్ 20న చంద్రబాబు డైమండ్ జూబ్లీ అంటే 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులతో విదేశాల్లోనే ఆ వేడుకలను చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదహారో తేదీన ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు అక్కడి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మొత్తం ఐదు రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు. వజ్రోత్సవ జన్మదినోత్సవాన్ని పూర్తిగా కుటుంబసభ్యులతోనే గడపనున్నారు.

చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంలో పుట్టిన రోజులు కూడా ఎప్పుడూ కుటుంబంతో గడప లేదు. కానీ ఇప్పుడు మాత్రం 75వ పుట్టిన రోజును మనవడితో సహా కుటుంబసభ్యులు అందరి సమక్షంలో చేసుకోవాలని నిర్ణయించారు. 2019లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కుటుంబానికి సమయం కేటాయించడం ప్రారంభించారు. అంతకు ముందు ఆయన పరిపాలనలో.. ప్రజల్లోనే ఎక్కువగా ఉండేవారు. 2019 తర్వాత మెల్లగా కుటుంబానికి సమయం పెంచారు. వీకెండ్స్ లో కుటుంబంతో గడుపుతున్నారు.

ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారానికి ఒక్క రోజు అయినా కుటుంబంతో గడుపుతున్నారు. కుటుంబ కార్యక్రమాలకూ హాజరవుతున్నారు. నారా రోహిత్ ఎంగేజ్మెంట్‌కు కూడా హాజరయ్యారు. మొత్తంగా చంద్రబాబు కుటుంబానికీ కొంత సమయం కేటాయిస్తూ ఉండటంతో.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ముఖ్యమైన వేడుకల్ని కలిసి చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సారి చంద్రబాబు పుట్టిన రోజును కుటుంబం అంతా కలసి చేసుకోనుంది.

దుబాయ్‌లో తెలంగాణవాసుల హత్య..

పొట్టకూటి కోసం దుబాయ్‌ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. వీరు దుబాయ్‌లోని అల్‌క్యూజ్‌ ప్రాంతంలో మోడర్న్‌ బేకరీలో పనిచేస్తున్నారు. వీరితోపాటు అక్కడే పనిచేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి వీరిని కత్తితో విచక్షణారహితంగా నరికి చంపారు. మతవిద్వేషంతోనే వారిని చంపినట్లు అక్కడ ఉంటున్న తెలంగాణవాసులు చెప్పారు. బేకరీలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
నిజామాబాదుకు చెందిన సాగర్, ధర్మపురి మండలానికి చెందిన శ్రీనివాస్ మరణించారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ విషయంలో ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. శ్రీనివాస్ అన్నయ్య సత్యంతో మాట్లాడి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. వారికీ తోడుగా కేంద్రప్రభుత్వం ఉంటుందని అన్నివిధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. బీజేపీ తెలంగాణ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖతో ఇప్పటికే మాట్లాడిందని, మృతుల పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా వారి గ్రామాలకు తీసుకువస్తాం అని మాట ఇచ్చారు.

ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని..ఈ అంశంపై జోక్యం చేసుకుని దుబాయ్ తోపాటు ఇతర ఇస్లాం దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వనీదే అంటున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

కాగా శ్రీనివాస్ మ్రుతితో స్వగ్రామమైన దమ్మన్నపేటలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ కు భార్య మంజుల ఇద్దరు కొడుకులు ఉన్నారు.