Letest news… ప్రధాన వార్తలు..

*జులై 8 కంటే ముందే భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌పై ప్రకటన..!*

భారత్‌-అమెరికాల మధ్య వాణిజ్యఒప్పందంపై చర్చలు జోరుగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కీలక ప్రకటన జులై 8 కంటే ముందే వెలువడవచ్చని అధికారిక వర్గాలు చెబుతున్నాయి..

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 8 మంది మరణించారు. ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు..పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న బిల్డింగ్ కూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికుల్లో పలువురి ఫోన్లు పని చేయకపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు..
స్పందించిన సీఎం రేవంత్ : ఈ ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కార్మికులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని తెలిపారు. పేలుడు సమయంలో సిగాచి పరిశ్రమలో 66 మంది కార్మికులు ఉండగా, 36 మందికి గాయాలయ్యాయి. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఘటనా స్థలికి వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ చేరుకున్నారు. ఘటనాస్థలిని ఆయన పరిశీలించారు. అధికారులకు ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు..

ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కేవి…హరీశ్ రావు.

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో రియాక్టర్ పేలుడుపై తెలంగాణ మాజీమంత్రి హరీశ్ రావు స్పందించారు. సిగచిలో పేలుడు సంభవించిందని, భూమి కంపించేంత శబ్దం వచ్చిందని అన్నారు. 149 మంది కార్మికులు ఉదయం పని చేశారని తెలిపారు. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని, ఎనిమిది మంది చనిపోయారని చెప్పారు..సహాయక చర్యలు వేగంగా చేపట్టలేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స అందిస్తే ప్రాణాలు దక్కేవని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఏక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు..మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హరీశ్ రావు తెలిపారు. బిహార్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలుగు వాళ్లు కూడా బాధితుల్లో ఉన్నారని చెప్పారు. కంపెనీలో పనిచేసే వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఘటనపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు..ప్రమాద ఘటనపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎంత మంది చనిపోయారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదని అన్నారు. డ్యూటీలో ఎంత మంది ఉన్నారనే విషయంపై ఒక్కొక్క అధికారి ఒక్కొక్క లెక్క చెబుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో ఉన్నారని అన్నారు..ప్రమాద ఘటనపై ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎంత మంది చనిపోయారన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదని అన్నారు. డ్యూటీలో ఎంత మంది ఉన్నారనే విషయంపై ఒక్కొక్క అధికారి ఒక్కొక్క లెక్క చెబుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంతో ఉన్నారని అన్నారు..

*చికుబుకు రైలు.. బడికొచ్చెను చూడు..*

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఆకట్టుకునేందుకు రైలు బోగీల మాదిరి తరగతి గదులకు రంగులు వేశారు. వాటి ముందు నడుస్తున్న బాలికలను చూడగానే రైలు ఎక్కేందుకు ప్లాట్‌ఫాంపై వెళ్తున్న ప్రయాణికుల్లా కనిపించారిలా..

కాంగ్రెస్‌లో ఎందరో ఎన్నో కామెంట్స్‌ చేస్తున్నారు
-కాంగ్రెస్‌ బహిష్కృత నేత రావి శ్రీనివాస్.

నాకు మాత్రమే షోకాజ్‌ నోటీసులు, సస్పె్న్షన్
సీఎంకు నాపై తప్పుడు నివేదికలు ఇచ్చారు
నా సస్పెన్షన్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా అన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి చైనా భారత్‌ని టార్గెట్ చేసే ప్లాన్..!

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో కలిసి చైనా భారత్‌ని టార్గెట్ చేసే ప్లాన్ వేస్తోంది. ఇటీవల ఆ మూడు దేశాలు త్రైపాక్షిక సమావేశాన్ని నిర్వహించాయి. చైనా చరిత్రలో తొలిసారిగా బంగ్లాదేశ్, పాక్‌తో కలిసి ఇలా సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశంలో భారత్‌ని చుట్టుముట్టే ప్లాన్స్ పైనే ఈ మూడు దేశాలు చర్చించుకున్నాయని భారత్ ఆలోచిస్తుంది.

కర్నింగ్ ప్లాన్లు వేయడంలో చైనాకు చైనాయే సాటి. దానికితోడు ఇప్పుడు పాక్, మరోపక్క బంగ్లాదేశ్. ఇక ఈ మూడు కలిస్తే ఆలోచించేది ఏముంటుంది? భారతదేశాన్ని ఎలా చుట్టుముట్టాలా అన్నది తప్ప. ఇప్పుడు ఈ మూడు దేశాలు త్రైపాక్షిక చర్చలు జరపడంతో భారత్ ఇప్పుడు అదే అనుకుంటుంది..చైనా, పాక్ మనకు ఎప్పుడూ శత్రువులే. కానీ బంగ్లాదేశ్ షేక్ హసీనా అదికారంలో ఉన్న సమయంలో భారత్‌కు అనుకూలంటా బంగ్లాదేశ్ ఉండేది. ఎప్పుడైతే మహ్మద్ యూన్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి భారత్‌కు వ్యతిరేకం అయిపోయింది. దీనికితోడు పక్కనే ఉన్న పాక్, చైనాలు తోడై.. బంగ్లాదేశ్‌ను భారత్‌పైకి ఉసుగొల్పుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ త్రైపాక్షిక సమావేశంలో చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్, బంగ్లాదేశ్ తాత్కాలిక విదేశాంగ కార్యదర్శి రుహుల్ అలం సిద్దిఖీ, పాక్ అదనపు విదేశాంగ కార్యదర్శి ఇమ్రాన్‌లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో చైనా .. దక్షిణాసియా దేశాలతో బలమైన సంబంధాలు పెంచుకోవాలని చూస్తుందని, అలాగే పాక్, బంగ్లాదేశ్ నుంచి కూడా పలు రంగాల్లో సహాకారం కావాలని కోరినట్లు సమాచారం. అయితే మూడు గుంట నక్కలు ఒకో చోట కలిస్తే అక్కడ మంచి ఆలోచనలు ఉండవు కదా. భారత్ పైన కూడా ఏదో చెడు ఆలోచనలు కూడా ఈ సమావేశంలో ఈ మూడు దేశాలు చేసే ఉంటాయని భారత్ ఆలోచిస్తుంది. అయితే, భారత్ ఇప్పడు అన్ని రంగాల్లో బలంగా ఉంది. మన దేశాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు అంత ఈజీ కాదు కూడా.

నక్సలైట్లను చంపగలరేమోగానీ నక్సలిజాన్ని అంతం చేయలేరు..సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

నక్సలైట్లతో చర్చలు ఉండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. నక్సలైట్లను చంపగలరేమోగానీ నక్సలిజాన్ని అంతం చేయలేరని అన్నారు. వచ్చే ఏడాది మార్చిలోగా నక్సలిజాన్ని అంతం చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవాచేశారు.. మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా పర్యటలో భాగంగా మాట్లాడిన అమిత్ షా నక్సలైట్లు తక్షణమే హింసను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లు గిరిజన బిడ్డలను, పోలీసులను చంపినప్పుడు వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు గానీ.. ఇప్పుడు చర్చల కోసం చాలామంది పిలుపునిస్తున్నారని దుయ్యబట్టారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారన్నారు. ఆయుధాలు వీడేదాక వారితో చర్చలు ఉండవని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో నారాయణ స్పందించారు.