మార్చి 3, 2026న హోలీ పండుగ వస్తుంది. అంతే కాకుండా ఈ రోజే సంపూర్ణ చంద్రగ్రహణం. దీంతో చాలా మందిలో అయోమయ పరిస్థితులు నెలకున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్ర గ్రహణం రోజు హోలీ పండుగ జరుపుకోవచ్చా? కామ దహనం చేయవచ్చా అనే డౌట్స్ ఉంటాయి. కాగా, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం నీడలో కామ దహనం చేయడం అస్సలే మంచిది కాదంట. హోలీకా దహనం అనేది పూర్ణిమ తిథిలో చేస్తారు. ఈసారి ఫాల్గుణ మాసం శుక్ల పక్ష చతుర్దశీ తేది మార్చి 2,2026న వస్తుంది. పూర్ణిమ తిథి మార్చి 2న సాయంత్రం 5.55కు ప్రారంభమై, మార్చి 3 సాయంత్రం 5.07 గంటలకు ముగుస్తుంది. అయితే కామ దహనం మార్చి 2న భద్రా కాలం ముగిసిన తర్వాత మాత్రమే చేయాలి అంట, అంటే మార్చి 2 అర్ధరాత్రి 12 :50 గంటల నుంచి 2 :02 గంటల మధ్యలో కామ దహనం చేయడానికి ఉత్తమమైన సమయం అని చెబుతున్నారు పండితులు. ఎందుకంటే మార్చి 3 ఉదయం 6 గంటల తర్వాత గ్రహణం నూతక కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి, రాత్రి 12 : 50 గంటల తర్వాత కామ దహనం చేయవచ్చునంట…ఇక కొంత మంది చంద్ర గ్రహణం రోజు హోలీ పండుగ జరుపుకోవచ్చా? లేదా అని సందిగ్ధంలో ఉన్నారు. అయితే చంద్రగ్రహణం నూతక కాలం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో పండుగను జరుపుకోకూడదంట. అందువలన వీలైనంత వరకు గ్రహణం ముగిసిన తర్వాత మార్చి 4 చైత్ర కృష్ణ పక్ష ప్రతిపాదన హోలీ జరుపుకోవాలంట. మార్చి 3న చంద్రగ్రహణం నూతక కాలం ఉండట వలన మార్చి 4న హోలీ పండుగ, మార్చి 2న కామ దహనం చేయాలని చెబుతున్నారు పండితులు.
భారత దేశంలో 2026 సంవత్సరంలో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం ఇది. ఈ గ్రహణం మార్చి 3 న మధ్యాహ్నం 3 :20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6 :47 నిమిషాలకు ముగుస్తుంది. ఇక ఈ చంద్ర గ్రహణానికి 9 గంటల ముందు నూతక కాలం ప్రారంభం అవుతుంది. అంటే మార్చి3న ఉదయం 6 : 20 గంటలకు నూతక కాలం ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ రోజు హోలీ పండుగ జరుపుకోకూడదంట.
మార్చి 3న హోలికా దహనం రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. హోలీ – చంద్ర గ్రహణం ఒకేసారి రావడం కన్యా రాశి వారికి శుభం కాదు. మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. ధనానికి సంబంధించిన సమస్యలు రావచ్చు…
మేష రాశి వారికి కూడా జీవిత భాగస్వామితో పాత వివాదంపై మళ్ళీ వాదన పెరగవచ్చు. బంధుత్వాలలో చీలికలు రావచ్చు కాబట్టి శాంతంగా ఉండండి. సమాజంలో ప్రతిష్టకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయమూ తొందరపాటున తీసుకోవద్దు.
మీన రాశిపై శని యొక్క శని దశ నడుస్తోంది. ఇలాంటప్పుడు హోలీ పండుగ రోజున గ్రహణం నీడ మీ జీవితంలో పెను మార్పులు తీసుకురావచ్చు. ఉద్యోగంలో సవాళ్లు పెరుగుతాయి. చట్టపరమైన విషయాల్లో చిక్కుకోకుండా ఉండండి. వృధా ఖర్చులకు దూరంగా ఉండండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది.