ఆంధ్రప్రదేశ్ టిడిపి కూటమిలో కుంపటి తయారయ్యింది. ఇప్పటికే జనసేన టిడిపి బిజెపిలో ఉన్న కార్యకర్తలకు పడక ఒకరిపై ఒకరి దాడులు ప్రతిదాడులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు…అయితే తాజాగా బీజేపీలో ఉన్న నటి మాధవి లత పై టిడిపి పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమెఓ వ్యభిచారి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం మీడియాలో వైరల్ గా మారాయి.
Madhavi Latha is a prostitute JC Prabhakar Reddy shocking comments
మరి ఇంతకీ జెసి ప్రభాకర్ రెడ్డి మాధవిలతను అలా ఎందుకు అన్నారంటే..తాజాగా న్యూయర్ సందర్భంగా మాధవి లత జెసి పార్క్ వైపు ఎవరు వెళ్లకండి అని,అక్కడ చాలామంది గంజాయి తాగుతూ ఉన్నారని,అది సురక్షితమైన ప్లేస్ కాదని,మహిళలు వెళ్తే ఏమైనా చేస్తారు అంటూ జెసి పార్క్ ను ఉద్దేశించి షాకింగ్ కామెంట్లు చేసింది.(JC Prabhakar Reddy)
అయితే మాధవి లత మాటలపై మండిపడిపోయిన చేసే ప్రభాకర్ రెడ్డి మాధవిలతను ఉద్దేశించి ఆమె ఓ ప్రాస్టిట్యూట్.. అసలు బిజెపి వాళ్లు మాధవి లతను తమ పార్టీలోకి ఎందుకు తీసుకున్నారో అర్థం అవ్వడం లేదు. ఆమె పెద్ద వేస్ట్ క్యాండిడేట్.. మాధవి లత మాట్లాడిన మాటలు పట్టణ మహిళలను అవమానించినట్లుగా ఉన్నాయి.
JC Prabhakar Reddy
జెసి పార్కులో అక్రమాలు జరుగుతున్నాయి గంజాయి తాగుతున్నారు అంటూ మాధవిలత మాట్లాడిన దాంట్లో ఎలాంటి నిజం లేదు.. అంటూ జేసి ప్రభాకర్ రెడ్డి మాధవి లత మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం జేసి ప్రభాకర్ రెడ్డి మాధవి లతను ప్రాస్టిట్యూట్ అని అన్న పదం మీడియాలో వైరల్ గా మారింది.మరి దీనిపై మాధవి లత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.