ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. ఆరెస్సెస్‌ పై నిషేధం విధించాలి…!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)కి మద్దతు ఇచ్చేందుకు అఖిల భారత ఉలేమా బోర్డు ముందుకొచ్చింది…ఎంవీఏ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తామని ఆ కూటమి నాయకులకు రాసిన లేఖలో పేర్కొంటూ పలు షరతులు విధించింది. ప్రధాన షరతులివీ.. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు రద్దుకు ఎంవీఏ కృషి చేయాలి. ఎంవీఏ అధికారంలోకి వస్తే మహారాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు రూ.1,000 కోట్లు కేటాయించాలి. రాష్ట్రంలో ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు కేటాయించాలి. ఆరెస్సెస్‌ పై నిషేధం విధించాలి..