🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 10 – 11 – 2024,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
దక్షిణాయణం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : నవమి సా4.36 వరకు,
నక్షత్రం : ధనిష్ఠ ఉ7.47 వరకు,
యోగం : ధృవం రా11.28 వరకు,
కరణం : కౌలువ సా4.36 వరకు,
తదుపరి తైతుల తె3.33 వరకు,
వర్జ్యం : మ2.36 – 4.07,
దుర్ముహూర్తము : సా3.52 – 4.37,
అమృతకాలం : రా11.43 – 1.14,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండం : మ12.00 – 1.30,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.05,
సూర్యాస్తమయం: 5.23,
*_నేటి విశేషం_*
*అక్షయ నవమి*
*విజయాలను చేకూర్చే అక్షయ నవమి*
కార్తీకమాసం లో వచ్చే *శుక్లపక్ష నవమిని ‘అక్షయ నవమి‘ అని అంటారు.*
త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది.
*కార్తీకమాసంలో కృత్తికా నక్షత్రం , గురు గ్రహం , సోమవారం కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.*
శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది.
ఈ నక్షత్ర పురుషుని వర్ణన , విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది.
నక్షత్ర పురుషునికి కృత్తికలు కటి (నడుము) స్థానంగా ,
మూలా నక్షత్రం పాదాలుగా ,
రోహిణి నక్షత్రం తొడలుగా ,
అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి.
కాగా పూర్వాషాఢ నక్షత్రం , పురుషాఢ నక్షత్రం , ఫల్గుణీ నక్షత్రాలు మర్మస్థానాలుగా , భాద్రపద నక్షత్రాలు భుజాలుగా , రేవతి నక్షత్రం కుక్షిగా , అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా , విశాఖ నక్షత్రం ముంజేతులుగా , హస్త చేతులుగా , పునర్వసు నక్షత్రం వేళ్ళుగా , జ్యేష్ఠ కంఠంగా , పుష్యమి నక్షత్రం ముఖంగా , భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి…
*ఈ రోజున ‘అక్షయ నవమి’ వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్యరాశి పెరిగి , సకల సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.*
లోక కళ్యాణం కొరకు ‘కూష్మాండుడు‘ అని పిలువబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించిన రోజే ఈ అక్షయ నవమి.
*ఈ రోజునే ‘కృతయుగం‘ ఆరంభమైన రోజుగా ‘సత్యయుగాది’ గా పేర్కొంటారు.*
అంతే కాకుండా ఈ రోజునే రాక్షస సంహారానికి అమ్మవారు వివిధ రూపాలు ధరించడానికి నాంది అని కూడా చెప్తారు.
లక్ష్మీ నారాయణుల సన్నిధిలో విజయలక్ష్మిని లేక వీరలక్ష్మిని గాని నిలిపి , రావి , ఉసిరి , తులసి మొక్కలను ఉంచి పూజను చేయవలెను.
ఈ విధంగా చేసే పూజను ‘జగద్ధాత్రి పూజ‘ అని పిలిచెదరు.
అక్షయ నవమి నాడు
*పఠించవలసిన స్తోత్రములు:-*
విష్ణు విజయ స్తోత్రం
కనకధారా స్థవం
దుర్గా స్తోత్రం
లక్ష్మీ అష్టోత్తరం
నివేదనలు:-
*చక్కెర పొంగళి, దద్ధోజనం*
*పూజా ఫలితములు:-*
*పాపరాశి ధ్వంసం , ధన లాభం , శత్రు నాశనం , అధికార ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.*
*_🌻శుభమస్తు🌻_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏