మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. రూ. 558 కోట్లు సీజ్!
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 6వరకు మొత్తంగా రూ.558.67 కోట్ల విలువైన నగదు, తాయిలాలను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అందులో రూ.92.47 కోట్లు నగదు కాగా.. రూ.52.76 కోట్ల విలువైన మద్యం, రూ.68.22 కోట్ల మాదకద్రవ్యాలు, రూ.104.18 కోట్ల ఆభరణాలు, రూ.241.02 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొంది.