మహారాష్ట్రలో భారీ వర్షాలు,13 మంది మృతి..

మహారాష్ట్రలో భారీ వర్షాలు, 13 మంది మృతి.

ముంబైలో ఐదు రోజుల్లో ఐదుగురు మృతి.

ముంబై,థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్ జిల్లాలకు రెడ్అలర్ట్..

చెరువును తలపిస్తున్న అంధేరి సబ్‌వే..

వాయవ్య బంగాళాఖాతం (Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండం (Vayugundam) గా మారింది. ప్రస్తుతం ఇది బాలాసోర్‌కు దక్షిణ-ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, చాంద్‌బలికి ఈశాన్యంగా 60 కిలోమీటర్లు, దిఘాకు దక్షిణ-నైరుతిగా 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ వాయుగుండం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ బాలాసోర్ సమీపంలో చాంద్‌బలి-దిఘా మధ్య ఉత్తర ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబయి నగరం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, రహదారులపై నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వరకు వర్షపాతం నమోదవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది. అధికారుల ప్రకారం ప్రజా రవాణా సేవలు కొనసాగుతున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు.

భారీ వర్షాల ప్రభావం థానే, పాల్ఘర్, నవీ ముంబయి, పుణె ప్రాంతాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడగా, రహదారులు నీటమునిగాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. సముద్ర అలలు 4.19 మీటర్ల ఎత్తుకు ఎగసే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బాంద్రా ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు భారీ చెట్టు కూలిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు…

ఇప్పటివరకు ఐదుగురు మృతి..

వర్షాలతో మహారాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 30న ముంబైలో ఒక స్కూల్ బస్సుపై భారీ రావి చెట్టు కూలిపోవడంతో 11 ఏండ్ల బాలుడు, రెండు రోజుల తర్వాత సాకినాక ప్రాంతంలో తెరిచి ఉన్న మ్యాన్‌‌హోల్‌‌లో పడి 55 ఏండ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పుణెలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీ గుంతలో పడి రెండేండ్ల చిన్నారి నీట మునిగి చనిపోవడం తీవ్ర విషాదం నింపింది. థానేలో నిలిచిన నీటిలో నడుస్తూ జారిపడిన ఒక మహిళ.. విద్యుత్ ట్రాన్స్‌‌ఫార్మర్ లైవ్ వైర్‌‌ను తాకడంతో కరెంట్ షాక్‌‌కు గురై మరణించింది.