ముస్లీం ఎమ్మెల్యేకు తప్పని వేధింపులు..! ఆగ్రహానికి కారణం ఇదే..!

ముస్లీం ఎమ్మెల్యేకు తప్పని వేధింపులు..!
దీపం వెలిగించడమే జీహాదీల ఆగ్రహానికి కారణం .

కేరళలో ఓ మహిళా ఎమ్మెల్యే సంప్రదాయ నిలవిలక్కు దీపాన్ని వెలిగించడమే వివాదానికి దారి తీసింది. రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని దీపం వెలిగించిన ఎమ్మెల్యే ఫాతిమా తహిలియాపై ముస్లీం మతపెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య మతపరంగా సరికాదని విమర్శలు గుప్పించారు.

దీపం వెలిగించడం కేరళ సాంస్కృతిక సంప్రదాయంలో భాగమని పలువురు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మతపరమైన కోణంలో వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా మతాచారాలు, సాంస్కృతిక సంప్రదాయాల మధ్య సమతుల్యతపై చర్చకు దారితీసింది.

ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని వివాదాస్పదంగా మార్చడం సరైందేనా? అనే ప్రశ్న ఇప్పుడు కేరళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది..