మీనాక్షికి సుప్రీంకోర్టులో షాక్..పిటిషన్ కొట్టివేత.
కాంగ్రెస్ నేత మీనాక్షీ నటరాజన్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
మధ్య ప్రదేశ్లో తన రాజ్యసభ
నామినేషన్ ను తిరస్కరించడంపై దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది.
దానికి విచారణ అర్హత లేదని, RO నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది…
కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఎదురుదెబ్బ తగిలింది. తన రాజ్యసభ నామినేషన్ను తిరస్కరించారంటూ ఆమె వేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నామినేషన్ తిరస్కరణలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్ ను విచారించింది. మీనాక్షి తరఫున (Meenakshi Natarajan) సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కనీసం రెండేళ్లు జైలు శిక్ష ప క్రిమినల్ కేసులు కూడా ఆమెపై లేవని పేర్కొన్నారు. కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయన్నారు. వాదనలు విన్న అనంతరం.. నామినేషన్ తిరస్కరణ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టంచేసింది. గతంలో అలాంటి తీర్పులు ఏమైనా ఉంటే కోర్టు ముందు పెట్టాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి ఒకసారి అభ్యర్థి నామినేషన్ను తిరస్కరిస్తే.. దానిపై ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించడమే సరైన మార్గమని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదంటూ దాన్ని కొట్టివేసింది..
