మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

మల్కాజిగిరి చౌరస్తాలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు

కొద్దిగా సమయం ఇవ్వండి మేమే తీసేస్తాం అంటున్న ఫుట్ పాత్ పై వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులు..

ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నచిరు వ్యాపారుల పట్ల పోలీసుల పహారాలో జీహెచ్‌ఎంసీ అధికారులు దౌర్జన్యం చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కాళ్లు మొక్కుతా సార్ 5 నిమిషాలు టైం ఇవ్వండన్న ఇవ్వలేదని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 20, 30 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని ఈడ్చి పడేశారు. పొద్దున నుండి చాయ్ తాగడానికి డబ్బులు లేవు.. ఇప్పుడు మేము భిక్షం అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మమ్మల్ని ఏడ్పించి వాళ్ళు ఏమీ బాగుపడుతారని బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది.

20 రోజుల కింద కూడా మీ షాపులకు ఫైన్ కట్టాలని రూ.5 వేలు కట్టించుకున్నారు.. అప్పుడు కూడా మా షాపులు ఇక్కడ ఉండకూడదని చెప్పలేదు. మాకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదంది. ఉన్నట్లు ఉండి ఇలా మా షాపులు కూల్చేస్తే మేము ఇప్పుడు ఎక్కడ బ్రతకాలి.. ఏం చేయాలి. నాకు షుగర్, బీపీ ఉంది.. పొద్దున నుండి తల నొప్పిగా ఉంది. మా ప్రాణాలు పోయినా సరే మేము ఇక్కడ నుండి వెళ్లమని స్పష్టం చేసింది.

మా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు.. మేము ఇక్కడే పుట్టి పెరిగాం. ఇన్నేళ్ల నుండి ఎవరూ ఏమనలేదు.. ఈ రేవంత్ రెడ్డి వచ్చాకనే మా ఇండ్లు కూల్చేశాడని మరో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. లక్షలు లక్షలు అప్పు చేసి షాపు పెట్టుకుంటే దాన్ని కూల్చేశారు.. మేమెలా బ్రతకాలంటూ మల్కాజ్‌గిరిలో ఫుట్‌పాత్‌పై షాపు కోల్పోయిన మహిళ వాపోయింది.

https://www.facebook.com/share/v/1AvMudcWDR/