మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ లో సైనిక లాంఛనాలతో అధికారికంగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంతిమయాత్ర సమయంలో మన్మోహన్ కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. పాడె మోశారు. అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజుతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భూటాన్ రాజు కేసర్ నామ్ గేల్ వాంగ్ చుక్, పలువురు విదేశీ ప్రముఖులు హాజరై మన్మోహన్ సింగ్ కు తుది వీడ్కోలు పలికారు…..మన్మోహన్ కు తుది వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం.. చితి ముట్టించడానికి ముందు ప్రార్ధనలు నిర్వహించారు. గురు గ్రంథ్ సాహెబ్ లోని వాఖ్యాలను చదివి వినిపించారు. అనంతరం మన్మోహన్ గౌరవార్ధం సైనికులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.