వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసిన.. యువసేన ఫౌండేషన్..

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో కొంతమంది వృద్ధులకు యువసేన ఫౌండేషన్ వారు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. యువసేన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కాంపాటి సందీప్ మాట్లాడుతూ ఈ శీతాకాలంలో కురిసే మంచు. చలికి వృద్ధులు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని మా వంతు సహాయంగా కొంతమందికి దుప్పట్లు పంపిణీ చేశాం. డబ్బు అధికారం దేనిలోని దొరకని ఆనందం ఇతరులకు సహాయం చేయడంలో ఉంటుందని మా ఫౌండేషన్ సభ్యులందరం భావించాం. ఇదేవిధంగా మా వంతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ. తోటి వారికి సహాయం అందిస్తామని మా యువత ఎప్పుడు ముందుంటుందని. ఆయన అన్నారు… ఈ యువత చేసిన పనిని చూసి పలువురు వృద్ధులు హర్ష వ్యక్తం చేశారు… ఇట్టి కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఉపాధ్యక్షులు. వల్లపుదాస్ ఉపేందర్. గురవయ్య. జోష్. నాగరాజు. సాయి. సైదులు. నరసింహ. సైదులు. తదితరులు పాల్గొన్నారు..