ముగిసిన మహిళల కబడ్డీ పోటీలు… లక్ష గెలుచుకున్న విజయనగరం టీమ్

ముగిసిన మహిళల కబడ్డీ, మొదలైన మెన్స్ కబడ్డీ.

మహాశివరాత్రి జాతర సందర్బంగా పోశం నర్సిరెడ్డి, వీరారెడ్డి గార్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల మెన్ & ఉమెన్స్ కబడ్డీ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. మహిళల విభాగం ఫైనల్ మ్యాచ్ కు ముఖ్యఅతిధులు గా వచ్చినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , పోశం నర్సిరెడ్డి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. ఇట్టి మ్యాచ్ లో ఫైనల్ లో జట్టు వైజాగ్ టీం పై గెలిచి విజయనగరం జట్టు 100000/-(లక్ష రూపాయల) ప్రైజ్ మనీ గెలుచుకుంది.. సెకండ్ ప్రైజ్ *70000/- వైజాగ్ టీం సొంతం చేసుకున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలనుండి 8 ఇన్విటేషన్ టీమ్స్ మరియు నియోజకవర్గ స్థాయి నుండి 6 టీమ్స్ పాల్గొన్నాయి. నిన్న మెన్స్ లీగ్ మ్యాచ్ లు మొదలైయ్యాయి. ఈరోజు లీగ్స్ తో పాటు సెమిస్ మరియు ఫైనల్ మ్యాచ్ లు కూడా పూర్తి అవుతాయాని టోర్నమెంట్ కన్వీనర్ పోశం వీరారెడ్డి ప్రకటించారు..

ఈ కార్యక్రమం లో కాకునూరి భాస్కర్ రెడ్డి , మాజి ఎంపీపీ కొట్టే పద్మ సైదేశ్వరావు , మాజి జడ్పీటీసీ పద్మగోవిందరెడ్డి మేళ్లచెరువు సర్పంచ్ పద్మావతి శ్రీనివాస్ రెడ్డి , ఉప సర్పంచ్ పసుపులేటి నాగేశ్వర్ రావు , బోగాల కొండా రెడ్డి , ఏసిరెడ్డి వీరారెడ్డి , కందుల సురేష్, పడిగపాటి కొండా రెడ్డి, ముడేం శ్రీనివాస్ రెడ్డి, గోంగారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నామ నర్సింహా రావు, మేళ్లచెరువు SI పరమేష్ , DE వెంకట కృష్ణయ్య , మైహోం యాజమాన్యం, కబడ్డీ ఆర్గనైజషన్ సభ్యులు మరియు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.