ఢిల్లీపై విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి..

చివరి రెండు ఓవర్లలోనే మేము మ్యాచ్ పై పట్టు కోల్పోయాం.

ఐపీఎల్ లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ప్లే ఆఫ్స్ లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ చేసి ముంబై విజయంలో కీలక భూమిక పోషించాడు. తొలుత కట్టుదిట్టమైన బంతులతో ఢిల్లీ బౌలర్లు బౌలింగ్ చేశారు. దీంతో 18 ఓవర్లకు ముంబై స్కోర్ 132/5 మాత్రమే. దీంతో కనీసం 160 పరుగులైనా చేస్తుందా అని అందరూ భావిస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. అతనికి నమన్ ధీర్ (8బంతుల్లో 24నాటౌట్) తోడు కావడంతో కేవలం రెండు ఓవర్లలోనే 48 పరుగులు వచ్చాయి. దీంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది.భారీ పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో ఢిల్లీ బ్యాటర్లు వెంటవెంటనే ఔట్ అయ్యారు. ముఖ్యంగా మిచెల్ శాన్ ట్నర్, జస్ర్పీత్ బుమ్రాలు అద్భుత బౌలింగ్ తో చెరో మూడు వికెట్లు పడగొట్టారు. సమీర్ రిజ్వి (39), విప్రాజ్ నిగమ్ (20) పరుగులు మినహా మిగిలిన వారంతా తక్కువ పరుగులకే పెవిలియన్ కు వెళ్లిపోయారు.
ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరగా.. తాజాగా.. ఢిల్లీపై విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టింది.

‘మా జట్టు కుర్రాళ్లు గొప్ప పోరాట పటిమను ప్రదర్శించారు. బ్యాటింగ్ చేయడానికి ఇది అంత సులువైన పిచ్ కాదు. మొదటి నుంచి మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ, చివరి రెండు ఓవర్లలోనే మేము మ్యాచ్ పై పట్టు కోల్పోయాం. ఆ రెండు ఓవర్లు మా 18 ఓవర్ల అద్భుతమైన ఆటను నాశనం చేశాయి. మేము బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాం. సమీర్ రిజ్వీ అద్భుతంగా ఆడాడు. అతనిలో ప్రతిభ ఉంది. గత ఏడెనిమిది మ్యాచ్ లలో మేము బ్యాటింగ్, బౌలింగ్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతోనే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేదు.’’

అక్షర్ పటేల్ ఉండిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ వికెట్ పై అక్షర్ పటేల్ మంచిగా సెట్ అవుతాడు. ముంబై స్పిన్నర్ మిచెట్ శాంట్నర్ బౌలింగ్ చేసిన తీరుతో ఈ విషయం స్పష్టంగా తెలిసొచ్చింది. ఇలాంటి వికెట్ పై అక్షర్ సత్తాచాటేవాడు. కానీ, అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మిచెల్ స్టార్క్ కూడా అద్భుతమైన బౌలర్. కానీ, ముఖ్యంగా ఇలాంటి వికెట్ పై స్పిన్నర్ చాలా విలువైన ప్లేయర్. క్రికెట్‌లో మూమెంటమ్‌ను ఎప్పుడూ లైట్ తీస్కోవద్దు. చివరి రెండు మ్యాచ్‌ల్లో మూమెంటమ్ అందుకోవడానికి మేం బాగా పోరాడాం. అగ్రస్థానంలో ఉన్నప్పుడు అస్సలు మూమెంటమ్ కోల్పోకూడదంటూ ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ప్లే ఆఫ్స్ కు చేరగా.. తాజాగా.. ఢిల్లీపై విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టింది.