పంజాబ్‌పై ముంబై అద్బుత విజయం…

ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించింది. యువ బ్యాటర్ తిలక్ వర్మ (75*) అజేయ అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు..

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 57 పరుగులతో రాణించగా, అజ్మతుల్లా ఒమర్జాయ్ 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు..201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు రయన్ రికెల్టన్ 48 పరుగులతో శుభారంభం అందించాడు. మధ్యలో వికెట్లు కోల్పోయినా తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. కేవలం 33 బంతుల్లో 75 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. విల్ జాక్స్ 25 పరుగులతో సహకరించడంతో ముంబై 19.5 ఓవర్లలో 205/4 స్కోరు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది…టోర్నీ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన ముంబై ఇండియన్స్ ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ అవకాశాలను దెబ్బతీసింది. పంజాబ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, ఇతర మ్యాచ్ ల ఫలితాలు ఆ జట్టు అవకాశాలపై ప్రభావం చూపుతాయి. .