వేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

సూర్యాపేట జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(uttam kumar reddy) జిల్లా అధికారులని ఆదేశించారు…సూర్యాపేట Suryapet జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి అధికారులతో వెబెక్స్ వీడియో(webex) కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు… మొదటగా కలెక్టర్ మాట్లాడుతూ ముత్యాల బ్రాంచ్ కెనాల్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు కొత్త పైపులైన్స్, పంప్ హౌస్ పనులు జరుగుతున్నాయని తెలిపారు..మఠంపల్లి మండలంలో అగ్రికల్చరల్ యూనివర్సిటీ కొరకు సుమారుగా 100 ఎకరాలు గుర్తించడం జరిగిందని స్థల పరిశీలన కొరకు టీం ను పంపుతున్నట్లు కలెక్టర్ మంత్రికి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కొరకు మ్యాపింగ్, ఆర్కిటెక్ వంటి పనులు ఏడబ్ల్యుఐడీసీ వారి ద్వారా జరుగుతున్నాయని తెలిపారు… పలువురు జిల్లా స్థాయాధికారులు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించి స్థల సేకరణలు కూడా పూర్తిస్థాయిలో చేపట్టినట్టు తెలిపారు… కోదాడ మరియు హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పలు కార్యాలయాల నూతన శంకుస్థాపనకు స్థల సేకరణ కూడా చేసినట్టు తెలిపారు..

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లడుతూ...

జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో మాట్లాడుతూ.. ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని త్వరగత్తెన పూర్తి చేయాలని అన్నారు… అంతేకాకుండా రానున్న ఫిబ్రవరి నెలలో మొదలుకానున్న పెద్దగట్టు జాతర చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి కలెక్టరు ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతరకు సంబందించిన శాఖలు అన్ని ఏర్పాట్లు చూడాలని,, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఘనంగా నిర్వహించాలని అన్నారు… ఎక్కడైతే కార్యాలయాల ఏర్పాట్లు, జరగబోతున్నాయో వాటికి త్వరగా తన స్థల సేకరణను చేయాలని పేర్కొన్నారు.. చింతలపాలెం, పాలకీడు మండలాల్లో కార్యాలయాల ఏర్పాటులకి అధికారులతో ముచ్చటించడం జరిగింది.. కోదాడలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులని అడుగు తెలుసుకోవడం జరిగింది… పనులు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి మరికొంత స్పీడ్ గా చేసి నివేదిక సమర్పించాలని మంత్రి పేర్కొన్నారు…