ఇస్రోకు చెందిన జీఎస్ఎల్వి-ఎఫ్17, ఈఓఎస్-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతం..
Mission Success!
GSLV-F17 has successfully accomplished its mission, placing EOS-05 into the intended orbit.
Sharing a few memorable moments from the lift-off.
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో ), భూ సమకాలిక కక్ష్య నుండి పనిచేసేలా రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05ను, శుక్రవారం తెల్లవారుజామున GSLV-F17 ద్వారా విజయవంతంగా ప్రయోగించింది..51.7 మీటర్ల ఎత్తు, 420.5 టన్నుల బరువు గల మూడు దశల రాకెట్, శ్రీహరికోటలోని రెండవ ప్రయోగ వేదిక నుండి తెల్లవారుజామున 2.55 గంటలకు నింగిలోకి దూసుకెళ్లి, సుమారు 2,367 కిలోగ్రాముల భూ పరిశీలన ఉపగ్రహాన్ని దాని ఉద్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది 19వ జీఎస్ఎల్వి ప్రయోగం. జీఎస్ఎల్వి-ఎఫ్17లో నాలుగు ఎల్40హెచ్ లిక్విడ్ స్ట్రాప్-ఆన్‌లతో కూడిన ఎస్139 సాలిడ్ కోర్, ఒక జీఎల్40హెచ్‌టి లిక్విడ్ రెండవ దశ, ఒక సీయూఎస్15 స్వదేశీ క్రయోజెనిక్ ఎగువ దశ, మరియు నాలుగు మీటర్ల కాంపోజిట్ ఓగివ్ పేలోడ్ ఫెయిరింగ్ ఉన్నాయి..EOS-05 ఉపగ్రహాన్ని 171 కి.మీ. నామమాత్రపు పెరిజీ, 31026 కి.మీ. అపోజీ మరియు 19.28 డిగ్రీల వంపుతో కూడిన జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఉపగ్రహంలోని థ్రస్టర్లను ఉపయోగించి పలు విన్యాసాల ద్వారా ఈ ఉపగ్రహాన్ని తుది కక్ష్యలోకి తరలిస్తారు..రాకెట్ ఉపగ్రహాన్ని ఉద్దేశించిన కక్ష్యలోకి కచ్చితంగా ప్రవేశపెట్టిందని ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ అన్నారు. శ్రీహరికోట నుంచి ఇది 107వ ప్రయోగం కాగా, జీఎస్ఎల్వి (GSLV) 19వ ప్రయోగం. ప్రయోగం అనంతరం ఛైర్మన్ మిషన్ కంట్రోల్ కాంప్లెక్స్ నుంచి ప్రసంగించారు. “మొదటి జీఎస్ఎల్వి ప్రయోగంలో 1536 కిలోల పేలోడ్‌ను ప్రయోగించిన ఈ రాకెట్, తన చరిత్రలోనే అత్యంత బరువైన 2367 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లిందని” ఛైర్మన్ తెలిపారు. “స్ట్రక్చరల్ మాస్‌ను ఆప్టిమైజ్ చేయడం, ప్రొపల్షన్ సిస్టమ్‌ను మెరుగుపరచడం ద్వారా మేము వాహనం పనితీరును క్రమంగా మెరుగుపరిచాము. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి ప్రయోగించిన భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక ఇమేజింగ్ ఉపగ్రహం ఇది. ఇది వ్యూహాత్మక డేటాను అందిస్తుంది…ఈ ఆర్థిక సంవత్సరంలో నావిగేషన్ శాటిలైట్ ఎన్విఎస్-03, గగన్‌యాన్ తొలి మానవరహిత ప్రయోగాంతో సహా మరో ఆరు ప్రయోగాలను ఇస్రో చేపట్టనుందని చైర్మన్ తెలిపారు.