కన్న కొడుకు గెంటివేశాడని ఇంటిముందు తల్లిదండ్రుల ధర్నా మియాపూర్ ఆల్విన్ కాలనీలో ఇంటిముందు తల్లిదండ్రుల ఆందోళన కొడుకు కోడలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది..
కన్న కొడుకు ఇంటి నుంచి గెంటివేశాడని తల్లిదండ్రుల ధర్నా
మియాపూర్, ఆల్విన్ కాలనీలో ఘటన
తమ కన్న కొడుకు ఇంటి నుంచి గెంటివేశాడని ఆరోపిస్తూ వృద్ధ తల్లిదండ్రులు ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. మియాపూర్లోని ఆల్విన్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొడుకు, కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంట్లో ఉండేందుకు అవకాశం ఇవ్వకుండా బయటకు పంపించారని ఆరోపిస్తూ ఇంటి ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు.
తమకు న్యాయం చేయాలని, కొడుకు నుంచి రక్షణ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.