రోడ్లు వేసే కాంట్రాక్టర్ల నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లు పారిపోతున్నారు… జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి..
రాజకీయ నాయకులకంటే ప్రభుత్వ అధికారులే అవినీతిపరులు..
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. MLA Arvind Reddy.
నేను ఒక వ్యక్తికి చెందిన పని చేయమని అడిగితే ఓ అధికారి చేయలేదు, కానీ ఆ వ్యక్తి రూ.15 వేలు ఇవ్వగానే పని చేశారు..
అధికారులు లంచం తీసుకోవడం వల్లే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది..
రోడ్లు వేసే కాంట్రాక్టర్ల నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తుంటే కాంట్రాక్టర్లు పారిపోతున్నారు..– జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అధికారులపై ఆరోపణలు గుప్పించారు.. అంతేకాకుండా కనీసం సమాజంలో జర్నలిస్టులైన వారి బాధ్యతను సరిగా నిర్వచిస్తున్నారా అని ఆలోచనకొస్తే అది కూడా కొంత ఇబ్బందికరంగానే ఉందని అన్నారు.. అధికారుల పట్ల జర్నలిస్టులు వార్తలు వేస్తూ అవినీతిని ప్రశ్నిస్తుంటే ఎమ్మెల్యేగా తన బాధ్యతగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.. మీరే బాధ్యతను మరిచిపోతే సమాజం ఇంకా ఇబ్బందుల పాలవుతుందని జర్నలిస్టులకు సూచనలు ఇచ్చారు.. జర్నలిస్టులు సరిగ్గా వార్తలు రాస్తే అధికారులకి కుర్చీ కదలాలని అన్నారు…. నేను ఒక పనికి ఫోన్ చేస్తే అధికారి స్పందించలేదు పదివేల రూపాయల లంచం ఇస్తే ఆ పని పది రోజుల్లోనే అయిపోయిందని అధికారులపై ఆరోపణలు గుప్పించారు.. అధికారులు మారకపోతే సమాజం కూడా లంచగొండితనం అలవాటు అవుతుందని అన్నారు..
కనీసం కాంట్రాక్టర్లు నాణ్యతగా రోడ్లు వేద్దామని ఆలోచనతో ఉన్నవారి వద్ద నుండి కూడా కమిషన్లు వసూలు చేస్తుంటే రోడ్లు వేయడానికి కూడా ఏ కాంట్రాక్టర్ వచ్చే పరిస్థితి లేదని అన్నారు…..