ఎమ్మెల్యే కోమటి రెడ్డి శ్రీధర్ రెడ్డిపై రౌడీషీటర్లు హత్యకు కుట్ర..!

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి శ్రీధర్ రెడ్డిపై రౌడీషీటర్లు హత్యకు కుట్ర జరుగుతుందని తెలియడంతో రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే జగదీష్, శ్రీకాంత్ ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉండగా రికార్డు చేసుకున్న వీడియో పోలీసులకు చేరింది. ఈ వీడియో బిగ్ టీవీ చేతికి చిక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో పోలీసులకు 5రోజుల క్రితమే అందిందని సమాచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా పెరోల్ మంజూరు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి…ఎవరైతే లేడీ డాన్ అని పేరు పొందిన అరుణ ఉన్నారో ప్రస్తుతం అరెస్ట్ అయి జైల్లో ఉంది. అరుణ మాట్లాడిన మాటలు కూడా వారంతో రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో నానా హల్‌చల్ చేశారు. ఒక బడానేత తనవైపు ఉన్నారని, తనకు పెరోల్‌కి సంతకం పెట్టి లెటర్ ఇచ్చారని చెప్పకొచ్చింది. పోలీసుల అదుపులో వున్న అరుణ బడానేత అంటూ ప్రస్తావించిందో ఆ బడానేత శిష్యులే.. జగదీష్, శ్రీకాంత్ ఉన్నారని కీలక సమాచారం. ఆ బడానేతనే శ్రీకాంత్ పెరోల్ మీద విడుదల కావడానికి లెటర్ కూడా ఇచ్చారని వారు మీడియా ముందుకు వచ్చి చెప్పడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఈ ముగ్గరు కూడా ఆ బడానేత మాకు దేవుడని చెప్పడం కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది..