నేటి ముఖ్యంశాలు…

*భారతదేశం G20 అధ్యక్ష పదవిని చేపట్టింది*

*ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో బాలిలో జరుగుతున్న #G20 సమ్మిట్‌లో #G20 అధ్యక్ష పదవికి అధికారికంగా లాఠీని ప్రధానమంత్రి #నరేంద్ర మోడీకి అందజేశారు. డిసెంబర్ 1 నుంచి G 20 అధ్యక్ష పదవిని చేపట్టేందుకు భారత్ సర్వం సిద్ధం చేసుకుంది.
_________________.

ద నీతి ఆయోగ్‌ పూర్తిస్థాయి సభ్యుడిగా ఫౌండేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ గ్రోత్‌ అండ్‌ వెల్ఫేర్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్వింద్‌ విర్‌మాని నియమితులయ్యారు.

ఈ మేరకు కేబినెట్‌ సెక్రటేరియట్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రధానమంత్రి ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థలో సభ్యులుగా వీకే సారస్వత్‌, ప్రొఫెసర్‌ రమేష్‌ చంద్‌, వీకే పాల్‌ ఉన్నారు. విర్‌మాని నియామకంతో ఆ సంఖ్య నాలుగుకు చేరింది. ఈయన 2009లో ఐఎంఎఫ్‌లో భారత ప్రతినిధిగా నియమితులయ్యారు. 2012 చివరి వరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో డాక్టరేట్‌ చేశారు…

__________________

అయిదు రోజులు జాగ్రత్త!

తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు విపరీతమైన చలి ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు. నిన్న ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 10.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేటి నుంచి ఈ నెల 20 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 7-10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావొచ్చని అధికారులు తెలిపారు. ఉదయం పూట పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది.

_________________.
మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చారు..

మర్రి శశిధర్‎రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలు వచ్చాయి. మర్రి శశిధర్‎రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రూమర్స్ రాగా ఆయన వివరణ ఇచ్చారు. ఢిల్లీకి రావడం కొత్త కాదన్నారు. తన మనవడి స్కూల్ ఫంక్షన్ కోసం ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. రాజకీయాల్లోనే ఉన్నానని ఇంకా రిటైర్డ్ కాలేదన్నారు. ఢిల్లీకి వచ్చిన విమానంలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని బీజేపీలో చేరేందుకే వచ్చాననడం వాస్తవం కాదని మర్రి శశిధర్‎రెడ్డి స్పష్టం చేశారు.
___________________________

తెలంగాణకు ఆరుగురు ఐఏఎస్‌ల కేటాయింపు..

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష-2021లో ఉత్తీర్ణులై ఐఏఎస్‌కు ఎంపికైన 178 మందిని వివిధ రాష్ట్రాల కేడర్‌కు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 9 మందిని, తెలంగాణకు ఆరుగురిని కేటాయించింది. ఏపీ మాతృ రాష్ట్రంగా ఉన్నవారిలో ఇద్దరిని, తెలంగాణ మాతృ రాష్ట్రంగా ఉన్న ఎనిమిది మందిని వేరే రాష్ట్రాల కేడర్‌కు పంపింది…
_____________________

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం ..

ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం. దర్శనాల కోసం భక్తులు ఆన్‌లైన్ సేవలు ఉపయోగించుకోవాలని కోరిన ట్రావెన్‌కోర్ దేవస్థానం…
_____________________.

మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ కు, క్రీడల్లో ప్రతిభావంతులకు భారత ప్రభుత్వం అందించే, ప్రతిష్టాత్మక ‘అర్జున అవార్డు’ రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
మహిళా బాక్సింగ్ లో వరుస విజయాలను నమోదు చేస్తూ, దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్ అర్జున అవార్డుకు నూటికి నూరు శాతం అర్హురాలని సీఎం అన్నారు. యావత్ భారత జాతి తెలంగాణ బిడ్డ ప్రతిభను చూసి గర్విస్తోందని సీఎం తెలిపారు..
______________

చిత్తూరు జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు..

చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి…15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. కాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు….
___________________

అధికార లాంఛనాలతో సూపర్ సార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి..

జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణ భౌతికకాయానికి వందనం చేశారు. కృష్ణకు కుమారుడు మహేశ్‌బాబు దహన సంస్కారాలు నిర్వహించాడు…
నటశేఖరుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణకు అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు అశ్రునయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు…అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవదేహానికి అభిమానులు, ప్రజలు, సినీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం.. మహాప్రస్థానం వరకు కృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు భారీ ఎత్తున అంతిమయాత్రకు తరలివచ్చారు…
____________________________