నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిల రాజ్యం అనుకుంటున్నారా..ఎమ్మెల్యే సామేలు.
సూర్యాపేట జిల్లా:
తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేలు మీడియా సమావేశం. … .
కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఎమ్మెల్యే మందుల సామేలు ఫైర్….
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి నా నియోజకవర్గానికి ఏం సంబంధం….
తుంగతుర్తి నియోజకవర్గ ఆగమవుతుందని రాజగోపాల్ రెడ్డి గాంధీభవన్ లో వ్యాఖ్యానించడం హాస్యాస్పదం…
బీజేపీ నుంచి వచ్చిన నువ్వు మాట్లాడే హక్కు లేదు….ఫస్ట్ నీ మునుగోడు మురికిని కడుక్కో…
నీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నీతో వచ్చిన వాళ్లకే మండల పార్టీ అధ్యక్షులు ఇవ్వలేదా….
నా హక్కులను హరిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా…
మంత్రి కోమటిరెడ్డికి మెంటల్ ఎక్కిందని ఘాటైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సామేలు….
దళిత నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏమిటని విరుచుకుపడ్డ ఎమ్మెల్యే సామేలు….
నల్లగొండ జిల్లా అంటే శ్రమజీవుల జిల్లా… పోరాటాల గడ్డ….
నా నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి గురించి మంత్రికి ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోలేదు….
నా నియోజకవర్గం గురించి మాట్లాడే నైతిక హక్కు మంత్రికి లేదు….
మా మాదిగోల్ల నియోజకవర్గాల జోలికొస్తే మా చిర్రామొగుద్ది… మా చిటిక మొగుద్ది… మా పని కత్తులు లేస్తాయి ఖబర్దార్…
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించిన మండల అధ్యక్షులే కొనసాగుతారు… అంతేగాని నా నియోజకవర్గంలో మంత్రి జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదంటూ రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..