అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు
ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడు
పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పాడు ..- కేటీఆర్.
ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. దేశ రాజధానిలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బర్త్ డే వేడుకలను సైతం రద్దు చేసుకుని, నల్ల చొక్కాతో ఆయన నిరసన పాల్గొన్నారు. ఆర్ఎస్ పిలుపు మేరకు ఇందిరా పార్క్ వద్దకు విద్యార్థులు ఉప్పెనలా తరలివచ్చారు….
కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు..
బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు..
మోడీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది..
ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోడీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది..
50వ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కేటీఆర్ విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచారు.హైదరాబాద్ వేదికగా తలపెట్టిన నిరసనలో ప్రత్యక్షంగా పాల్గొనాలని సంకల్పించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులు, నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటనున్నారు. నాడు ఓట్ల కోసం యువతకు అలవిగాని హామీలు గుప్పించి గద్దెనెక్కిన తర్వాత పాలకులు చేస్తున్న మోసాలను ఎండగట్టనున్నారు. తప్పుడు వాగ్దానాలిచ్చిన ప్రభుత్వాల మెడలు వంచే దిశగా కార్యోన్ముఖులను చేయనున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం చేపట్టనున్న కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో తీసుకువచ్చే సంస్కరణలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు..
రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ మాకు న్యాయం ఎందుకు జరగడంలేదని విద్యార్థులు అడుగుతున్నారు
8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా?
దేశం కోసం ధర్మం కోసం అంటారు, ఈ పిల్లలు హిందువులు కాదా? అని ప్రశ్నించారు..
తరం మారుతుంది, స్వరం మారుతుంది..జెన్జెడ్తో(Gen-Z) ప్రధాని మోదీ(PM Modi) జాగ్రత్తగా ఉండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు..నేపాల్లో యువత తలుచుకుంటే ప్రభుత్వమే కూలిపోయిందని గుర్తు చేశారు. ఈడీ, సీబీఐలకు భయపడి సోనమ్ వాంగ్చుక్ దీక్షను ఒక్క మీడియా సంస్థ కూడా చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ విద్యార్థులు మాకు సోషల్ మీడియా ఉందని ధైర్యంగా పోరాడుతున్నారు. కేంద్రంపై నిరసన కోసం వస్తుంటే మధ్యలో కాంగ్రెస్ వాళ్లు మమ్మల్ని అడ్డుకున్నారు. బడే భాయ్ కోసం చోటే భాయ్ అడ్డం పడుతున్నాడు. మోదీని అంటే ఈ కేడీ గాడికి ఏం అయింది. ఢిల్లీలో రాహుల్ గాంధీ పోయి మోదీ ఇంటి ముందు కూర్చుంటే.. ఈ నల్లమల పిల్లి పోయి కొడంగల్లో దాక్కున్నది అని ఎద్దేవా చేశారు.
రేప్ కేసులలో బీజేపీ నాయకుల కొడుకులకు బెయిల్ వస్తుంది కానీ మాకు న్యాయం ఎందుకు జరగడంలేదని విద్యార్థులు అడుగుతున్నారు. 8 మంది బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆ ప్రశ్నకు సమాధానం చెప్తారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే బీజేపీ వాళ్లు దేశం కోసం ధర్మం కోసం అంటారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న ఈ పిల్లలు హిందువులు కాదా? అని నిలదీశారు. అవసరమైతే మీకోసం కేసీఆర్ కూడా వస్తాడు. ఆయన సోషల్ మీడియాలో మీ ఆందోళన చూసి తల్లడిల్లిపోతున్నాడని తెలిపారు. పిల్లలే దేశ ముఖచిత్రాన్ని మారుస్తారు, వాళ్లే ఈ దేశాన్ని కాపుడుకుంటారని కరోనా సమయంలోనే కేసీఆర్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.