బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం..కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నర్సింహ్మయాదవ్.

బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం..

కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన నర్సింహ్మయాదవ్

స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం బెదిరింపు రాజకీయాలకు బాధపడుతున్నారని మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ నాయకులు సుంకరబోయిన నర్సింహ్మ ఆరోపించారు. శుక్రవారం కట్టంగూర్ ఉప సర్పంచ్ ఎన్నిక ఘర్షణ ఉద్రిక్తతల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్యానెల్ లో గెలుపొందిన వార్డు సభ్యుని గత మూడు రోజుల కింద ఎమ్మెల్యే బెదిరించి తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే నైతిక విలువలను విస్మరించి దౌర్జన్యం, అరాచకం, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజా అభిప్రాయాన్ని విస్మరించి తమ సభ్యులపై దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. స్థానిక ఎస్సై తమ వార్డు సభ్యులపై మహిళలని చూడకుండా దురుసుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇట్టి విషయాల్ని హైకమండ్ దృష్టికి తీసుకెళ్తామని, కాంగ్రెస్ కార్యకర్తలు అధిష్టానం నిర్ణయం మేరకు సమిష్టిగా ఎమ్మెల్యేను గెలిపించారని ఆ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టిలో ఉంచుకోకుండా ఇష్ట రాజ్యాంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. స్థానిక పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు..