మోదీ ప్రభుత్వ సంచలన నిర్ణయం….!!

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కీలక మార్గాల్లో కొత్త రైళ్లను నడిపేందుకు వీలుగా 7 కొత్త రైల్వే ప్రాజెక్టులకు, 4 లైన్ల ట్రాక్ విస్తరణ (Quadrupling) పనులకు కేంద్ర మంత్రివర్గం ఒకేసారి ఆమోదం తెలిపింది.

ముఖ్యంగా, దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ – ముంబై రైల్వే మార్గాన్ని 4 లైన్ల (Quadruple) ట్రాక్‌గా మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల ఈ రెండు నగరాల మధ్య రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం కావడమే కాకుండా, రైళ్ల రాకపోకల్లో జాప్యం పూర్తిగా తొలగిపోతుందని అధికారులు తెలిపారు. పండుగల సమయాల్లో సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపడానికి కూడా ఈ ప్రాజెక్టు ఎంతగానో దోహదపడుతుంది…ఈ నిర్ణయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. దేశంలో దాదాపు 11,000 కిలోమీటర్ల మేర విస్తరించిన 7 ప్రధానమైన హై-డెన్సిటీ (రద్దీ అధికంగా ఉండే) రైల్వే కారిడార్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై, చెన్నై-కోల్‌కతా, కోల్‌కతా-ముంబై వంటి ‘స్వర్ణ చతుర్భుజి’ (Golden Quadrilateral) మార్గాలు దేశంలోని మొత్తం రైలు ట్రాఫిక్‌లో దాదాపు 40 శాతాన్ని మోస్తున్నాయి. వీటిలో ఇప్పటికే పలు విభాగాల్లో పనులు పూర్తవగా, మిగిలిన మార్గాలను కూడా 4 లైన్ల ట్రాక్‌లుగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ క్వాడ్రపుల్ లైన్ ప్రాజెక్టులతో పాటు, 5 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కలుపుతూ 656 కిలోమీటర్ల మేర సాగే మరో 3 మల్టీ-ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. దాదాపు రూ.10,783 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను 2029-30 నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం గడువుగా నిర్ణయించింది…