తెలంగాణ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురిని ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చిన బీజేపీ అధిష్టానం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ నాయకులపై అరవింద్ ధర్మపురి చేసిన పరోక్ష విమర్శల కారణంగానే ఢిల్లీకి రమ్మని పిలుపునిచ్చినట్లు బీజేపీ వర్గాల చర్చలు..
గతంలో..
అధ్యక్షుడిగా రామచందర్రావు ప్రకటించగానే షాకయ్యారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆయన యూటర్న్ తీసుకున్నారు. అధ్యక్ష పోటీ నుంచి ఆయన వెనక్కి తగ్గారు. చివరకు ఆయన నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ తరపున అధ్యక్షుడిగా ఎవరు నామినేషన్ వేసినా తన మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని చెప్పకనే చెప్పారు. వన్ సైడ్, గట్టిగా మాట్లాడేవారికి బీజేపీ దూరం పెట్టిందని చెప్పవచ్చు…
ఉప ఎన్నికల సందర్భంగా..
రాష్ట్ర బిజెపి అధ్యక్షులవారు నేను ఎక్కడ కూర్చున్న నా ప్రచారం జరుగుతూనే ఉంటుంది అది మీరు మర్చిపోవద్దు.. మీరందరూ కష్టపడి వార్డులలో తిరిగిన నేను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నాకే ఎక్కువ లేడు వస్తుందని.. అది మీరు గుర్తుంచుకోవాలంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి అయిన రామచందర్రావు పై పొలిటికల్ పంచులు పేల్చారు..