రూ.1500 కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిండు….బీజేపీ ఎంపీ రఘునందన్ రావు….
రూ.1500 కోట్ల విలువైన 85 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిండు….బీజేపీ ఎంపీ రఘునందన్ రావు….
కావాలంటే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టుకోవాలి కానీ రేవంత్ రెడ్డి భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎలా ఇచ్చాడు?..
పొంగులేటి చేస్తున్న రూ.1500 కోట్ల ల్యాండ్ స్కాం జరిగింది..పట్టపగలు గిరిజనులపై, మహిళలపై పోలీసులు, రెవిన్యూ అధికారులు దాడులు చేస్తున్నారు..17 మంది గిరిజనుల మీద పండగవేళ కేసులు పెట్టారు..
ఊరిలో గిరిజనులను పోలీసులు నాలుగురోజులగా పరిగెత్తిస్తున్నారు..
పోలీసులు వాళ్లు నిలబడి జేసీబీలు పెట్టించి సుమారు రూ.1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఒక పెద్ద మనిషికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు..
శంకర పల్లి మండలం కొండకల్, రామ చంద్ర పురం మండలం వెలిమల గ్రామాల మధ్య కొంత మిగులు ల్యాండ్ ఉంది. 450 ఎకరాలు ఉంటుంది. 1993 లో అక్కడ ఉండే గిరిజనులు ఆ భూములు లో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో 170 ఎకరాలు ప్రభుత్వం ఇండస్ట్రీ లకి ఇచ్చింది.
మిగులు భూమిని వేలిమల గ్రామానికి కేటాయించింది… ఆ భూమి ఎవరి కబ్జా లో ఉంది వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పటి టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేయాలని అనుకున్నారు. ఆ నేత ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. చివరకు 85 ఎకరాలు మిగిలింది. ఆ భూముల్లోకి పోలీస్ లు వెళ్లొద్దని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ నెల 8న. అయినా పోలీస్ లు అక్కడకి వెళ్లి గోడలు కట్టిస్తున్నారు. 15 వందల కోట్ల భూములని ఓ పెద్దమనిషి కి కట్ట బెడుతున్నారు అని రఘునందన్ రావు అన్నారు..