ములుగు సరిహద్దుల్లో పోలీసులు అలర్ట్.
ఛత్తీస్గఢ్-బీజాపూర్ సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంకటాపురం మండలం పాలెం వద్ద ప్రధాన రహదారిపై వచ్చి పోయే వాహనాలను స్థానిక ఎస్సై తిరుపతిరావు ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానిత వ్యక్తుల వద్ద సరైన ఆధారాలు సేకరించి, వివరాలను తెలుసుకున్నారు. ఎస్పీ శబరిశ్ ఆదేశాల మేరకు ముందస్తుగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.