ములుగు జిల్లాలో బొగత జలపాతం ఉగ్రరూపం..
తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగతకు భారీ వరద..
ఎడతెరిపి లేని వర్షాలకు నిండుకుండలా మారిన బొగత జలపాతం..
160 మీటర్ల వెడల్పు.. 50 అడుగుల ఎత్తు నుంచి ప్రవహిస్తున్న వరద..
జలపాతం ఉధృతితో మునిగిపోయిన రక్షణ వలయం కారిడార్..
పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శన తాత్కాలికంగా నిలిపివేత..
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం (Deep Depression) ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన బొగత జలపాతం (Bogatha Falls) ఉధృతంగా ప్రవహిస్తోంది. అటవీ ప్రాంతంలో గత 10 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Temporarilysuspended) ప్రకటించారు..