దేవరకొండ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు..!

దేవరకొండ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు

దేవరకొండ………..
శ్రీ షిరిడి జ్ఞాన సరస్వతి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ వారు గురు పౌర్ణమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించినారు
ఉదయం ఐదు గంటలకు కాకడ హారతి నిత్య అభిషేక కార్యక్రమం, ఉదయం ఎనిమిది గంటలకు జలం క్షీరాభిషేకం, 9:30 నిమిషాలకు గీత సత్సంగం ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణం, 11 గంటలకు పుష్పములతో వేద వ్యాస అష్టోత్తర పూజ, 11 గంటల 30 నిమిషాలకు విష్ణు సహస్రనామ పూజ,12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించినారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదములు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ భక్తులు తదితరులు పాల్గొన్నారు.