మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ..
*• ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు అమిత్షా, నితిన్ నబిన్..*
_• ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్నగర్లో నితిన్ నబిన్ సభ ఉండే అవకాశం.._
_• ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్లో అమిత్ షా సభ.._
_• దక్షిణ తెలంగాణలో ఒక సభ, ఉత్తర తెలంగాణలో ఒక సభ పెట్టే ఆలోచనలో బీజేపీ.
మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ. శంషాబాద్ నోవాటెల్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ లు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
మున్సిపల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. లిటరసీ ఎక్కువున్న ఏరియా కాబట్టి బీజేపీకి సహజంగానే పట్టు ఉంటుందన్నారు. ఇప్పటికే పాత 10 జిల్లాల కేంద్రాలలో ఏదో సందర్భంలో ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఎడ్యుకేటడ్ ఓటింగ్ అంతా బీజేపీవైపే ఓటింగ్ ఉంటుందన్న ఆలోచన ఉంటుంది కాబట్టి అలా కనపడుతుందన్నారు. మున్సిపాలిటీలకు వచ్చిన నిధులు, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, అమృత నిధులు అన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవే అన్నారు. మంచి నీళ్లు కావాలంటే స్వామి ది నిధి నుండి ఇచ్చామన్నారు. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.