తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగనుంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇవాళ (బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలు, షెడ్యూల్‌పై కమిషనర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో భాగంగా కలెక్టర్లకు ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాల ప్రచురణపై డెడ్‌లైన్లు నిర్దేశించారు. జనవరి 12వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను తప్పనిసరిగా ప్రచురించాలని ఈసీ ఆదేశించింది. 13వ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలతో కూడిన ముసాయిదా జాబితాను విడుదల చేసి, వెంటనే టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఇక, జనవరి 16వ తేదీ లోపు పోలింగ్ స్టేషన్ల పూర్తి వివరాలతో పాటు ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను వార్డు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ చర్య ద్వారా ఓటర్లకు తమ పోలింగ్ కేంద్రం, వివరాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని ఈసీ పేర్కొంది..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.