మున్సిపల్ ఎన్నికలు. ఈ నెలలోనే నోటిఫికేషన్..!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా…రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లలో నిమగ్నమైంది…

మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయినట్టే..

117 మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికల నిర్వహణ రంగం సిద్ధం.
ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ..

ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు మొదలుపెట్టాయి_

గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది_

ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది_

ఈ నెల 10న తుది జాబితా వెలువరిస్తుంది దీంతో ఈ నెల 11న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది_

ఒకవేళ సంక్రాంతి పండగ, సెలవుల కారణంగా కుదరకపోతే 20న విడుదల చేసే అవకాశం.

తెలంగాణలో మరోసారి మోగనున్న ఎన్నికల నగర.

ఈ నెలలోనే నోటిఫికేషన్..!

ఈ నెలలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుందని, ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. దీంతో రాష్ట్రంలో ప్రజా పాలన మరింత పటిష్టం కానుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత ఇచ్చారు. ఉపాధి హామీ పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి పారిపోయారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను అసెంబ్లీకి వచ్చి నిరూపించాలి తప్ప పారిపోవడం ఏంటని నిలదీశారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959