మస్క్ కి పిచ్చి పట్టింది..మస్క్‌ను అమెరికా నుంచి బహిష్కరించాలి….సంచలన వ్యాఖ్యలు…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బిలియనీర్ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ కు మధ్య స్నేహం కాస్త చెడింది. మస్క్ పికల్లోతు కోపంతో ఉన్న ట్రంప్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు..అమెరికాకు చెందిన ABC న్యూస్ తో జరిగిన సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ..”మస్క్ తన మతిస్థిమితం కోల్పోయాడు… నేను ఇకపై అతనితో మాట్లాడటానికి ఇష్టపడను” అంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఈ ఇంటర్వ్యూ శుక్రవారం ఉదయం ABC న్యూస్ చీఫ్ వాషింగ్టన్ కరస్పాండెంట్ జోనాథన్ కార్ల్ తో జరిగింది. ట్రంప్, ఎలోన్ మస్క్ మధ్య జరిగిన చర్చ అనంతరం గంటల తర్వాత ఈ ఇంటర్వ్యూ జరిగింది.

“నువ్వు మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నావు.”
గురువారం నాడు జరిగిన వివాదం గురించి ట్రంప్ అస్సలు ఆందోళన చెందలేదని.. అది అతి ముఖ్యమైన విషయం కాదన్నట్లుగా ABC న్యూస్ రాసింది. ఆ రోజు మస్క్‌తో ఫోన్ కాల్ షెడ్యూల్ చేసిందా.. అని ఉదయం 7 గంటలకు ముందు అడిగినప్పుడు, ట్రంప్ ఆశ్చర్యకరంగా.. “మీరు మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా?” “ఈ సమయంలో అతనితో (మస్క్) మాట్లాడటానికి తనకు ఆసక్తి లేదని” ట్రంప్ స్పష్టం చేశాడు. మస్క్ తనతో మాట్లాడాలనుకుంటున్నాడని, కానీ తాను మస్క్‌తో మాట్లాడటానికి సిద్ధంగా లేనని ట్రంప్ కూడా పేర్కొన్నారు.

తాను మస్క్ కు చాలా సహాయం చేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మస్క్ కౌంటర్ కూడా ఇచ్చారు. తాను లేకపోతే ట్రంప్ 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయేవారన్నారు. వన్ బిగ్ బ్యూటిపుల్ బిల్ ను తనకు ఒకసారి కూడా చూపించలేదని అన్నారు. కానీ దానిపై ట్రంప్ చేస్తున్న వాదనను తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని ఈవీ, సోలార్ ప్రోత్సాహకాల కోతలపై అనవసర ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు..

మస్క్‌ను అమెరికా నుంచి బహిష్కరించాలి.

ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, మాజీ శ్వేతసౌధ సలహాదారు స్టీవ్ బెనాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మస్క్‌ను “అక్రమ గ్రహాంతరవాసి”గా అభివర్ణించిన ఆయన, అమెరికా ప్రభుత్వం ఆయనపై వెంటనే విచారణ జరపాలని, దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థను సీజ్ చేయాలని కోరారు.

అమెరికాలో ఉండడానికి అనర్హుడు

బెనాన్ మాట్లాడుతూ “ఎలాన్ మస్క్ వలె ఇతర గ్రహాల నుంచి అక్రమంగా వచ్చినవారు అమెరికాలో ఉండటానికి అర్హులు కారు. ఆయన ఇమ్మిగ్రేషన్ స్థితిని పూర్తిగా పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ట్రంప్ వెంటనే తన అధికారం ఉపయోగించి స్పేస్‌ఎక్స్‌ను ప్రభుత్వాధీనంలోకి తీసుకోవాలి” అని వ్యాఖ్యానించారు.

కోరియా యుద్ధ చట్టాల ప్రకారం, దేశ రక్షణకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ప్రభుత్వం ప్రాధాన్యత కలిగిన ఒప్పందాల కోసం ప్రైవేట్ సంస్థలపై అధికారం కలిగి ఉంటుంది. ఈ అధికారాన్ని ట్రంప్ వినియోగించాలని బెనాన్ అభిప్రాయపడ్డారు. “పెంటగాన్ నుంచి చైనా చేతికి రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నారన్న అనుమానాలున్నాయి. ఆయనకు భద్రత ఎత్తేయాలి. ప్రభుత్వ ఒప్పందాలను కూడా రద్దు చేయాలి” అని మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు.

ట్రంప్, మస్క్‌ల మధ్య దూరం ఎప్పుడు మొదలైంది

మే నెలలో మస్క్, రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం మొదలైంది. లైంగిక కుంభకోణంలో నిందితుడితో ట్రంప్‌నకు సంబంధాలున్నాయంటూ మస్క్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో అప్పటివరకు ఉన్న సన్నిహిత బంధం పూర్తిగా తెగిపోయింది..