నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల..!

నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది..

తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2026 మూడవ సవరణ చట్టాన్ని గవర్నర్ ఆమోదించడంతో ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి టికె శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో ఇంతకాలం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతాయా లేవా అనేదానిపై ఉన్న ఉత్కంఠ దీనితో తొలగిపోయింది.మున్సిపాలిటీ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక రేపో మాపో రిజర్వేషన్ల అంశం కూడా తేలిపోనుంది..

Nalgonda | గ్రామాల విలీనం లేకుండానే..!?

ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీల్లో నల్గొండలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. పట్టణంలో ప్రస్తుతం 48 వార్డులు ఉన్నాయి. 2.25 లక్షల జనాభా ఉంది. దీంతో శివారు గ్రామాలను విలీనం చేయకుండానే కార్పొరేషన్గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణీకరణతో సుమారు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిధిని తీసుకుని మహానగరంగా ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) నిర్వహించనున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.