కంటతడి పెట్టించే ఘటన… చెల్లించి పోయిన మంత్రి నారా లోకేష్‌ ..

https://x.com/SanthoshKu34277/status/1859079257214927060?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1859079257214927060%7Ctwgr%5E57b0db273347386225c3264221f88b4cb782779e%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

అందరికీ బాల్యం ఇలాగా అందంగా ఉంటుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
విధి వెక్కిరించడమో, తల్లిదండ్రుల పొరపాటే కారణం ఏదైనా.. సంతోషంగా సాగాల్సిన బాల్యం కష్టాలమయం అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుకున్న ఓ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. దీనిపై ఏకంగా మంత్రి నారా లోకేష్‌ స్పందించారు.

వివరాల్లోకి వెళితే.. ఆడుతూ పాడుతూ జీవించాల్సిన ఓ పసి బాలుడి దుస్థితిని చూసి మంత్రి నారా లోకేశ్‌ చలించిపోయారు. కర్నూలులో రోడ్డు పక్కన యాచిస్తూ దయనీయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి.. మంత్రి లోకేశ్‌ను ట్యాగ్‌ చేస్తూ ఓ నెటిజన్‌ పోస్టు చేశారు. సంతోష్‌ కుమార్‌ అనే ఓ నెటిజన్‌ భిక్షాటనం చేస్తున్న ఓ చిన్నారి వీడియోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశాడు..

https://x.com/naralokesh/status/1859173679000678490?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1859173679000678490%7Ctwgr%5E57b0db273347386225c3264221f88b4cb782779e%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F

కనీసం ఐదేళ్లు కూడా నిండని ఓ కుర్రాడికి ఒంటి నిండా సిల్వర్‌ కలర్‌ పూసి రోడ్డు పక్కన కూర్చొబెట్టారు. అయితే ఆ సమయంలో చిన్నారికి నిద్ర రావడంతో కునుకుపాట్లు తీస్తూ కనిపించాడు. దీనంతటినీ వీడియోగా తీసి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు సంతోష్‌ కుమార్.

ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్‌గా ట్యాగ్‌ చేస్తూ.. కర్నూలు పట్టణంలో డ్రస్‌ సర్కిల్‌ షాపింగ్ మాల్‌కు సమీపంలో ఓ చిన్నారితో బిక్షాటనం చేయిస్తున్నారు. కుర్రాడిని బాగా హింసిస్తూ చివరికి భోజనం కూడా అందించకకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఓ పోస్ట్‌ చేశారు. దీంతో ఈ అంశంపై మంత్రి నారా లోకేష్‌ వెంటనే స్పందించారు..ఈ సంఘటన చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, భద్రత ప్రతీ చిన్నారి హక్కు అని ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ చిన్నారిని గుర్తించి రక్షణ కల్పిస్తామని, తామే స్వయంగా ఆ బుడ్డొడి రక్షణకు జవాబుదారిగా ఉంటామని స్పందించారు. అలాగే బాలుడి దుస్థికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు..