కేసిఆర్ చిత్రపటానికి గిరిజనులతో కలిసి పాలాభిషేకం..

*గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు
కేసిఆర్ ఫోటో కి గిరిజనుల తో కలిసి పాలాభిషేకం..రాపోలు నవీన్ కుమార్

నేరేడుచర్ల మండల కేంద్రం పులగంబండ తండా లో గిరిజనులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి గిరిజన బంధావుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో హుజుర్నగర్ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ 500 జనాభా కలిగిన ప్రతి తండా, ఆదివాసీ గూడేన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ప్రకటించి మొత్తంగా 1326 తండాలు, 525 గూడెలను పంచాయతీలుగా నిర్ణయించారు. తద్వారా ఆయా వర్గాలకు చెందిన వారినే స్వయం పాలకులుగా చేశారు. అభివృద్ధికి బాటలు వేశారు
*గిరిజనుల రిజర్వేషన్‌ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు*
ఇది కేవలం రిజర్వేషన్ కాదు గిరిజనుల ఆత్మగౌరవానికి ఇచ్చిన గౌరవం పోడు భూముల హక్కులు, విద్య, ఉపాధి, పారిశ్రామిక ప్రోత్సాహం గిరిజనుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ చారిత్రక నిర్ణయానికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గిరిజన, ఆదివాసీ వర్గాల తరఫున బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపుతూ పాలభిషేకం చేయడం జరిగింది అని మాట్లాడారు
ఈ కార్యక్రమం లో రామ్ సైదులు యువజన విభాగం నాయకులు పెరుమాళ్ళ సతీష్ కుమార్ తకెళ్ళ నాగార్జున రూపావత్ జైపాల్ నాయక్ భూక్యా సంతోష్ నాయక్ పర్వతం చంద్రగిరి రామావత్ గోపినాధ్ తో పాటు గిరిజన మహిళలు పాల్గొన్నారు.