న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణే భారత ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ తరువాత జరిగిన పరిణామాలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థ, పరీక్షల విధానంలో సంస్కరణలపై సిఫార్సులు చేయడానికి ఇన్వోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న నేరస్థులపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటోందని ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
పరీక్షా సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 26, 2026) ఒక ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అధిపతిగా నియమించిన నందన్ నీలేకని ఒక పారిశ్రామికవేత్త, టెక్నోక్రాట్ మరియు బ్యూరోక్రాట్. ఈ టెక్ పారిశ్రామికవేత్త మరియు ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు అనేక జాతీయ మరియు ప్రాంతీయ బాధ్యతల ద్వారా ప్రైవేట్ రంగం నుండి ప్రభుత్వ సేవ మరియు పరిపాలనలోకి మారారు…శ్రీ నీలేకని గారు బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులయ్యారు. 1981లో, పట్నీ కంప్యూటర్ సిస్టమ్స్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత, శ్రీ నీలేకని గారు ఎన్.ఆర్. నారాయణ మూర్తి మరియు మరో ఐదుగురితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. దశాబ్దాలుగా, ఆయన కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు, ఆ తర్వాత 2002 నుండి 2007 వరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో, కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించింది. ఆ తర్వాత 2017లో ఆయన కంపెనీలో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఆఫ్ ది బోర్డ్‌గా నియమితులయ్యారు..
టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యులు వీరే..
నందన్ నీలేకని చైర్మన్‌గా వ్యవహరించనుండగా ఈ టాస్క్ ఫోర్సులో మరో ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణులు అయిన అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రధానంగా ఏం చేస్తుంది..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతిక భద్రత, డిజిటల్ డేటా రక్షణ, అభ్యర్థుల వెరిఫికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ కమిటీ ప్రధాన ధ్యేయం. భవిష్యత్తులో ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ పూర్తి పారదర్శకత, విశ్వసనీయతతో నిర్వహించేలా ఈ కమిటీ నిర్మాణాత్మక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వానికి సూచించనుంది.