నేపాల్కు ఎగువన మరో ముప్పు రూపుదిద్దుకుంటోందని చైనా తాజాగా హెచ్చరించింది. మరో మూడు రోజుల్లో నేపాల్లో మరో జలప్రళయం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది…చైనా నీటి వనరుల శాఖ ప్రకటన ప్రకారం, ఛోచెన్ ఖోలా, పురెపు శాంగ్పో నదుల సంగమానికి దిగువన నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడంతో అక్కడ ఓ భారీ సరస్సు తయారైంది. కొండచరియలు లేదా మంచుచరియలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడిన సందర్భాల్లో ఇలాంటి సరస్సులు సహజంగా ఏర్పడుతుంటాయి. ఆ సరస్సులో గురువారం నాటికి 2 మిలియన్ ఘనపు మీటర్ల జలరాశీ ఉన్నట్టు చైనా గుర్తించింది… రాబోయే మూడు రోజుల్లో మరో మూడు మిలియన్ ఘనపు మీటర్ల నీరు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. చివరకు కట్ట తెగి దిగువన ఉన్న నదుల్లో వరద పోటెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. కంప్యూటర్ల సాయంతో చైనా ఇంజినీర్లు వరద ఉధృతిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేపాల్లోని త్రిశూలీ, భోటెకోశీ, నారాయణి నదీ తీరాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తెరలివెళ్లాలని అక్కడి ప్రభుత్వం సూచించింది.
https://x.com/kiranpatel1977/status/2092869660589056372?s=20